Weird News: ఇలాంటి వ్యక్తి భూమి మీద ఇప్పటి వరకూ పుట్టలేదు.. 80 ఏళ్లుగా ఇతని రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేదు.. ఎందుకంటే

రాబర్ట్ అమెరికాలోని ఆల్టన్ (ఇల్లినాయిస్) నగరంలో ఫిబ్రవరి 22, 1918న జన్మించాడు. అందుకే రాబర్ట్  ను 'ది జెయింట్ ఆఫ్ ఇల్లినాయిస్' అని ముద్దుగా పిలిచేవారు. రాబర్ట్ కేవలం 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు.. పొడవు 3 అడుగులకు దగ్గరగా ఉండేది.

Weird News: ఇలాంటి వ్యక్తి భూమి మీద ఇప్పటి వరకూ పుట్టలేదు.. 80 ఏళ్లుగా ఇతని రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేదు.. ఎందుకంటే
Robert Wadlow
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2022 | 12:49 PM

ప్రపంచంలో అనేక రకాల ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరొకరు రికార్డులు సృష్టించడం… వాటిని మరొకరు బీట్ చేయడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ప్రపంచ రికార్డ్స్ ని మాత్రం కొన్ని ఏళ్లుగా పదిలంగా ఉన్నాయి.. వాటిని ఎవరూ బీట్ చేయలేకపోవడంతో అవి చరిత్రలో పదిలంగా ఉన్నాయి. అలాంటి కొన్ని రికార్డులు ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి పేరు మీదనే ఉన్నాయి. చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తి ఎవరో తెలుసా.. అతని రికార్డు ఎన్ని సంవత్సరాలుగా బద్దలు కాలేదు? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఆ వ్యక్తి చిత్రాన్ని పంచుకుంది. ‘అత్యంత ఎత్తైన వ్యక్తి అద్భుతమైన చిత్రం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రంలో అతనితో పాటు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక చిన్న పిల్లవాడితో సహా మొత్తం 6 మంది వ్యక్తులున్నారు.

ఈ వ్యక్తి పేరు రాబర్ట్ వాడ్లో, అతను చరిత్రలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఈ రికార్డ్ 80 సంవత్సరాల క్రితం నెలకొల్పబడింది. అంతేకాదు ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1940 తర్వాత అతని ప్రపంచ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. రాబర్ట్ ఎత్తు ఎనిమిది అడుగుల 11.1 అంగుళాలు. రాబర్ట్ తర్వాత ఇంత పొడుగ్గా ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు భూమిపై పుట్టలేదు. చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అతని పేరు నమోదు కావడానికి కారణం ఇదే.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం.. రాబర్ట్ అమెరికాలోని ఆల్టన్ (ఇల్లినాయిస్) నగరంలో ఫిబ్రవరి 22, 1918న జన్మించాడు. అందుకే రాబర్ట్  ను ‘ది జెయింట్ ఆఫ్ ఇల్లినాయిస్’ అని ముద్దుగా పిలిచేవారు. రాబర్ట్ కేవలం 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు.. పొడవు 3 అడుగులకు దగ్గరగా ఉండేదని, సాధారణంగా పిల్లలు ఆ ఎత్తుకు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు.

కేవలం 5 సంవత్సరాల వయస్సులో, రాబర్ట్ 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ పొడవుగా ఎదిగాడు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు సమానమైన ఎత్తు లేదా తక్కువ ఎత్తు కలిగి ఉన్నారు. అదే సమయంలో రాబర్ట్ 12 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సుమారు 7 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. 1936లో.. రాబర్ట్‌కి 18 ఏళ్లు నిండినప్పుడు అతను పొడవు 8 అడుగుల 4 అంగుళాలకు చేరుకున్నాడు. దీంతో అప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తుల రికార్డులన్నింటినీ దాటి సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. అతను షూ నంబర్ 37AA. ఈ షూ అతని కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. అయితే.. రాబర్ట్ కేవలం 22 సంవత్సరాల వయస్సులో 1940లో మరణించాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..