Butler County couple: 79 ఏళ్ల వైవాహిక జీవితం.. 20 గంటల వ్యవధిలో తనువు చాలించిన శతాధిక దంపతులు..
ఫ్రాన్సిస్ జూన్ , విలియం హుబెర్ట్ మాలికోట్ లు 100 సంవత్సరాల వయస్సు గల బట్లర్ కౌంటీ నివాసితులు గత వారం కేవలం 20 గంటల తేడాతో భార్యాభర్తలు మరణించారు.
భార్యాభర్తల బంధం అంటే అర్ధం చెప్పారు ఈ హామిల్టన్ జంట.. తమ 100 ఏళ్ల వయసులో ఇద్దరిదీ 81 ఏళ్ల ప్రేమ.. 79 వైవాహిక జీవితం.. భార్య మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే భర్త మరణించిన ఘటన గత వారం చోటు చేసుకుంది. ఫ్రాన్సిస్ జూన్ , విలియం హుబెర్ట్ మాలికోట్ లు 100 సంవత్సరాల వయస్సు గల బట్లర్ కౌంటీ నివాసితులు గత వారం కేవలం 20 గంటల తేడాతో భార్యాభర్తలు మరణించారు. తన తల్లిదండ్రుల మరణంపై వారి కుమారుడు సామ్ మాలికోట్ (76 ) మాట్లాడుతూ.. వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళారు. జీవితంలో మరణం ప్రతి ఒక్కరికీ తప్పదు.. అయితే తన తల్లిదండ్రులు ఒకరికొకరుగా ఆనందంగా సంతోషంగా జీవించారని చెప్పాడు.
మాలికోట్ థాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ను ఒక రోజు ముందుగానే తమ కుటుంబం సభ్యులతో జరుపుకున్నారు. పిజ్జా డిన్నర్‌ని ఏర్పాటు చేశారు. అప్పుడు “అంతా బాగానే ఉంది,” సామ్ మాలికోట్ చెప్పారు. అయితే రాత్రి తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్పుడు పక్క వీధిలో నివసిస్తున్న హుబెర్ట్ కుమార్తె జో మాలికోట్ ( 70) తన తల్లిని ఆస్పత్రికి తరలించారు.
తన భార్యను నవంబర్ 25న చూడడానికి వెళ్ళాడు.. అప్పుడు తన తండ్రి మనసు చాలా బాధపడింది. తన తల్లి చివరి క్షణాల్లో అక్కడే ఉన్నాడు తన తండ్రి అని చెప్పాడు సామ్ మాలికోట్. రోజుల తరబడి స్పృహలో లేని.. తన తల్లి నవంబర్ 30 రాత్రి 9:15 గంటలకు మరణించారు. తన భార్య మరణించిన దాదాపు 20 గంటల తర్వాత డిసెంబర్ 1 సాయంత్రం 5:40 గంటలకు తండ్రి మరణించినట్లు కుమారుడు చెప్పాడు.
అంతేకాదు తన తల్లిదండ్రులను కోల్పోవడం గురించి అడిగినప్పుడు.. మాలికోట్ ఇలా అన్నాడు: “నేను విచారంగా ఉన్నాను.. అయితే నేను బాధపడకూడదు ఎందుకంటే తన తల్లిదండ్రులు కలిసి సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. ఇద్దరు దేవునికి, కుటుంబానికి అంకితమయ్యి జీవించారు. ఈ ఏడాది జూన్ 8న తమ 79వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. జూన్‌కు జూలై 13న 100 ఏళ్లు పూర్తి చేసుకోగా.. హుబెర్ట్ జూలై 23న 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
1942 శీతాకాలంలో.. మాలికోట్ US నేవీలో చేరాడు. 13 రోజులు సెలవుపై ఇంటికి వచ్చినప్పు సమయంలో జూన్‌ను చూశాడు. పరిచయం ప్రేమగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తాను ఇంటికి తిరిగి వస్తాడో లేదో అతనికి తెలియదు. దీంతో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. మాలికోట్ డైబోల్డ్ ఇంక్.లో పని చేయడం మొదలు పెట్టాడు. 1990లో షాప్ సూపర్‌వైజర్‌గా పదవీ విరమణ చేశాడు. మాలికోట్ దంపతులకు ముగ్గురు పిల్లలు, సామ్, జో, థెరిసా మెక్‌బ్రైడ్, ఏడుగురు మనవలు, 11 మంది మనవరాళ్ళు. ఈ దంపతులకు కాలిన్స్‌విల్లే స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..