Chinese Woman: స్పైసీ ఫుడ్ తిని గట్టిగా దగ్గడంతో పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన యువతి.. డాక్టర్లు చెప్పిన రీజన్ వింటే షాక్

షాంఘై నగరానికి చెందిన హువాంగ్‌ అనే మహిళ ఈ మధ్య కాస్త ఘాటైన ఆహారం తీసుకున్నారట. దాంతో ఆమెకు పొలమారినట్టయి విపరీతంగా దగ్గు వచ్చేసిందట. అలా దగ్గుతున్న సమయంలో ఆ మహిళకు చాతిలో నొప్పి వచ్చిందట.

Chinese Woman: స్పైసీ ఫుడ్ తిని గట్టిగా దగ్గడంతో పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన యువతి.. డాక్టర్లు చెప్పిన రీజన్ వింటే షాక్
Chinese Woman Fractures Four Ribs
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2022 | 9:58 AM

తుమ్మితే ఊడిపోయే ముక్కు.. దగ్గితే పోయే ప్రాణం అనే సామెతను పెద్దలు తరచుగా వింటూనే ఉన్నారు.. అయితే ఇందుకు ఉదాహరణగా చైనాకు చెందిన మహిళ నిలుస్తుందేమో అనిపిస్తుంది.. ఎందుకంటే ఆ మహిళ కొంచెం గట్టిగా దగ్గితే చాలు పక్కటెముకలు విరిగిపోయాయి. అంతేకాదు ప్రస్తుతం ఆమె కాస్త గట్టిగా దగ్గినందుకే పక్కటెముకలు విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. ఇదెక్కడి చోద్యం దగ్గితేనే ఎముకలు విరిగిపోతాయా అనుకోకండి. మీరు విన్నది నిజమే. అయితే అందుకు కారణమేంటో డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. షాంఘై నగరానికి చెందిన హువాంగ్‌ అనే మహిళ ఈ మధ్య కాస్త ఘాటైన ఆహారం తీసుకున్నారట. దాంతో ఆమెకు పొలమారినట్టయి విపరీతంగా దగ్గు వచ్చేసిందట. అలా దగ్గుతున్న సమయంలో ఆ మహిళకు చాతిలో నొప్పి వచ్చిందట. అయితే దగ్గడం వల్లే తగ్గిపోతుందిలే అని ఆమె లైట్‌ తీసుకున్నారు. అయితే ఆ మర్నాడు కూడా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిసింది. అక్కడ వైద్యులు మహిళను పరీక్షించి స్కానింగ్‌ చేశారు. ఆ రిపోర్టు చూసిన వైద్యుల సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ స్కానింగ్‌ రిపోర్డులో మహిళ ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోందట.

అయితే, దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయో వైద్యులు కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి