AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి వద్దు ఒంటరితనమే ముద్దు అంటోన్న ఆ దేశంలోని యువత.. పెళ్లి, పిల్లల బాధ్యతలు వద్దుబాబోయ్ అంటోన్న యువతీయువకులు

డబ్బులు, ఉద్యోగ భద్రత లేకపోవమే తాము పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడానికి కారణం అని సగానికి పైగా యువత చెబుతుండగా.. మరో 12% మంది యువత తాము పెళ్లి చేసుకుని పిల్లలను కని.. వారిని పెంచడం భారంగా భావిస్తున్నామని చెప్పారు

పెళ్లి వద్దు ఒంటరితనమే ముద్దు అంటోన్న ఆ దేశంలోని యువత.. పెళ్లి, పిల్లల బాధ్యతలు వద్దుబాబోయ్ అంటోన్న యువతీయువకులు
South Koreans Don't Wish To Marry
Surya Kala
|

Updated on: Dec 08, 2022 | 8:24 AM

Share

పశ్చిమాసియా దేశమైన దక్షిణ కొరియాలో యువత ఆలోచనా తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆ దేశంలో రోజు రోజుకీ జననాల సంఖ్య తగ్గుతోందని.. ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ లో తాత బామ్మలు తప్ప.. మనవలు, మనవరాళ్లు ఉండరని ఆందోళన వ్యక్తమవుంటుంది. అంతేకాదు.. ఆ  దేశంలో రోజు రోజుకీ యువత తగ్గడం.. వృద్ధుల రేటు పెరగడంతో ఆర్ధిక విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా యువత జీవన ఆలోచనల్లో భారీ మార్పులు వచ్చాయని.. కుటుంబ సభ్యులతో జీవించడం కంటే.. ఒంటరిగా జీవించడానికే యువత ఎక్కువ ఆసక్తిని చూపిస్తోందని.. దీంతో 2050లో ఒంటరిగా జీవిస్తున్న దక్షిణ కొరియన్ల నిష్పత్తి సహస్రాబ్ది ప్రారంభం నుండి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు విషయంలో ప్రతిబింబిస్తుంది.

2021లో దక్షిణ కొరియా దేశంలో దాదాపు 7.2 మిలియన్లు లేదా మూడింట ఒక వంతు కుటుంబాలు.. ఎక్కువమంది కుటుంబ సభ్యులుంటే నివసించడానికి ఆసక్తి చూపించడం లేదని.. ఒంటరిగా జీవించడానికే ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 2000లో 15.5%గా ఉన్న ఈ నిష్పత్తి బహుశా శతాబ్దం మధ్య నాటికి దాదాపు 40%కి పెరగవచ్చని కొరియా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

కొరియన్లు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో సామాజిక నిబంధనలు ,ఆర్థిక పరిస్థితులు రెండింటినీ ఎదుర్కోవడంతో కుటుంబాల పరిస్థితి,  కుటుంబంలోని సభ్యుల సంఖ్యను ప్రతిబింబిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

దక్షిణ కొరియాలో ఇప్పుడు UK వలె దాదాపుగా ఒకే వ్యక్తి ఉన్న ఇల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటి సంఖ్య  జపాన్ లేదా జర్మనీ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది.

డబ్బులు, ఉద్యోగ భద్రత లేకపోవమే తాము పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడానికి కారణం అని సగానికి పైగా యువత చెబుతుండగా.. మరో 12% మంది యువత తాము పెళ్లి చేసుకుని పిల్లలను కని.. వారిని పెంచడం భారంగా భావిస్తున్నామని చెప్పారు. దాదాపు 25% మంది తమకు సరైన భాగస్వామి దొరకలేదని లేదా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. యువతీ యువకుల్లో పెళ్లిపై అనాసక్తితో ఒంటరిగా నివసించే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు వృద్ధాప్య జనాభా మరింత పెరిగి ప్రభుత్వంపై ఒత్తిడిని కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయ్ జననాల రేటును అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లలు పుట్టే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలను కంటే ఆ తల్లిదండ్రులకు మన దేశ కరెన్సీ లో ప్రతి బిడ్డకూ  రూ.1,35,000 అందిస్తున్నారు. అంతేకాదు ఆ పిల్లవాడి పోషణ నిమిత్తం ఒక సంవత్సరం వచ్చే వరకూ ప్రతినెలా రూ. 20 వేలు చెల్లిస్తున్నారు. ఈ పథకం ద్వారా అందించే మొత్తం 2025 నుంచి మరింత పెంచనున్నామని ఆ దేశ అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..