AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seals Dead on Beach: కాస్పియన్ తీరంలో వేల సంఖ్యలో మృత్యువాత పడిన సీల్స్.. అంతరించిపోతున్న జీవుల మరణాలపై ఆందోళన

కాస్పియన్‌ సముద్రంలో సహజ కారణాలవల్లే సీల్స్‌ చనిపోయాయిన డాడేస్తాన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ మినిస్ట్రీ చెబుతోంది.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ -IUCN నివేదిక ప్రకారం సీల్స్‌ కాస్పియన్ సముద్రంలో ఉన్న ఏకైక క్షీరదాలు.

Seals Dead on Beach: కాస్పియన్ తీరంలో వేల సంఖ్యలో మృత్యువాత పడిన సీల్స్.. అంతరించిపోతున్న జీవుల మరణాలపై ఆందోళన
Seals Dead In Caspian Sea C
Surya Kala
|

Updated on: Dec 06, 2022 | 6:29 AM

Share

సీల్స్  సముద్ర జీవులు..అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. రష్యా సముద్ర తీరంలో  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో సీల్స్  ఒక్కసారిగా చనిపోయాయి. అయితే ఇవి ఇలా ఒక్కసారిగా ఎందుకు మృత్యువాత పడ్డాయని అందరిలోనూ సందేహం.. అయితే వీటివి సహజ మరణాలు అని అధికారులు చెప్పారు.

కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు నీటి వనరు ఇది.. రష్యా, కజకిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాలు ఈ సముద్రం చుట్టూ ఉంటాయి.. రష్యాలోని డాగేస్తాన్‌ తీరానికి ఇటీవల భారీ సంఖ్యలో సీల్స్‌ కొట్టుకొస్తున్నాయి.. వీటిల్లో ఏ జీవి ఒక్కటి కూడా సజీవంగా లేదు.. అన్నీ మరణించిన సీల్స్‌.. ఒకటో, రెండో చనిపోయి తీర ప్రాంతానికి కొట్టుకువస్తే పెద్దగా ఆలోచించేవారు కాదేమో.. అయితే ఇలా సముద్ర తీరంలో మరణించిన సీల్స్ ఒడ్డుకు కొట్టుకు వస్తున్న సంఖ్య భారీగా ఉండడంతో అధికారుల సహా అందరూ ఉల్కి పడ్డారు. చనిపోయిన సీల్స్‌ సంఖ్య భారీ సంఖ్యలో ఉంది..

సముద్ర తీరంలో 700 డెడ్ సీల్స్ కనిపించాయని ప్రాంతీయ అధికారులు శనివారం తెలిపారు. అయితే రష్యా సహజ వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ  డాగేస్తాన్ విభాగం .. తర్వాత సీల్స్ దాదాపు 2,500లకు పైగా మరణించాయని ప్రకటించారు. మరణించిన సీల్స్ సంఖ్య రెండున్నర వేలకు పైగా ఉండటం కలకలం రేపుతోంది.. గత రెండు వారాలుగా కాస్పియన్‌ సముద్ర తీరంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.. ఎవరైనా ఈ సీల్స్‌ను చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానం కూడా ఏర్పడింది. అయితే వీటిని వేటాడి ఇక్కడి తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు.. తీరానికి వచ్చిన సీల్స్‌కు ఎవరైనా హింసించి చంపేశారా అంటే, అలాంటి పరిస్థితులు కూడా లేవని స్పష్టంగా తెలుస్తోంది. చేపల వేటలో చిక్కుకున్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లేవని కాస్పియన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ సెంటర్ హెడ్ జౌర్ గపిజోవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాస్పియన్‌ సముద్రంలో సహజ కారణాలవల్లే సీల్స్‌ చనిపోయాయిన డాడేస్తాన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ మినిస్ట్రీ చెబుతోంది.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ -IUCN నివేదిక ప్రకారం సీల్స్‌ కాస్పియన్ సముద్రంలో ఉన్న ఏకైక క్షీరదాలు. ఇవి 2008 నుండి అంతరించిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాణలు 3 లక్షల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.. కాస్పియన్‌ సీల్స్‌ను అంతరిస్తున్న ప్రాణులుగా గుర్తించి రెడ్‌ లిస్టులో చేర్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాణాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. చనిపోయిన సీల్స్‌ నుంచి నమూనాలను సేకరించి పరిశోధనలు మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..