AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Seals: కాస్పియన్ సముద్ర తీరంలో విషాద దృశ్యం.. ఏకంగా 2 వేలకు పైగా కలేబరాలు..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర వేల సీల్స్‌ చనిపోయాయి రష్యా తీరంలో.. ఇంతకీ అవి ఎందుకు మృత్యువాత పడ్డాయి? కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు..

Russia Seals: కాస్పియన్ సముద్ర తీరంలో విషాద దృశ్యం.. ఏకంగా 2 వేలకు పైగా కలేబరాలు..
Sea Seals
Shiva Prajapati
|

Updated on: Dec 06, 2022 | 11:07 AM

Share

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర వేల సీల్స్‌ చనిపోయాయి రష్యా తీరంలో.. ఇంతకీ అవి ఎందుకు మృత్యువాత పడ్డాయి? కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు నీటి వనరు ఇది. రష్యా, కజకిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాలు ఈ సముద్రం చుట్టూ ఉంటాయి. రష్యాలోని డాగేస్తాన్‌ తీరానికి ఇటీవల పెద్ద సంఖ్యలో సీల్స్‌ కొట్టుకొస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా సజీవంగా లేదు. అన్నీ మరణించిన సీల్స్‌ ఇవి. ఒకటో, రెండో చనిపోయి తీర ప్రాంతానికి కొట్టుకువస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ చనిపోయిన సీల్స్‌ సంఖ్య భారీ సంఖ్యలో ఉంది. మొదట 700 సీల్స్‌ చనిపోయాని గుర్తించారు. కానీ వీటి లెక్క రెండున్నర వేలకు పైగా ఉండటం కలకలం రేపుతోంది. గత రెండు వారాలుగా కాస్పియన్‌ సముద్ర తీరంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

ఎవరైనా ఈ సీల్స్‌ను చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానం కూడా వచ్చింది.. అయితే వీటిని వేటాడి ఇక్కడి తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు.. తీరానికి వచ్చిన సీల్స్‌కు ఎవరైనా హింసించి చంపేశారా అంటే, అలాంటి పరిస్థితులు కూడా లేవని స్పష్టంగా తెలుస్తోంది.. కాస్పియన్‌ సముద్రంలో సహజ కారణాలవల్లే సీల్స్‌ చనిపోయాయిన డాడేస్తాన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ మినిస్ట్రీ చెబుతోంది.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ -IUCN నివేదిక ప్రకారం సీల్స్‌ కాస్పియన్ సముద్రంలో ఉన్న ఏకైక క్షీరదాలు.

ఇవి 2008 నుండి అంతరించిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాణలు 3 లక్షల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.. కాస్పియన్‌ సీల్స్‌ను అంతరిస్తున్న ప్రాణులుగా గుర్తించి రెడ్‌ లిస్టులో చేర్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాణాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. చనిపోయిన సీల్స్‌ నుంచి నమూనాలను సేకరించి పరిశోధనలు మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..