AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భర్త అహంకారానికి భార్య ప్రతీకారం.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'జయ జయ జయ జయహే’ కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే మలయాళంలో మాదిరి ఇక్కడ హిట్ కాలేదు. జస్ట్ యావరేజ్ గా నిలిచింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: భర్త అహంకారానికి భార్య ప్రతీకారం.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Om Shanti Shanti Shantihi M
Basha Shek
|

Updated on: Feb 23, 2026 | 6:27 PM

Share

టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. తెలుగమ్మాయి ఇషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. 2022లో మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జయ జయ జయహే’ కు ఇది రీమేక్. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ జస్ట్ యావరేజ్ గా నిలిచింది. మలయాళం రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. అయితే గోదావరి యాస్ లో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ ఇషా యాక్టింగ్ కు ప్రశంసలు వచ్చాయి. అలాగే ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ కూడా అదరగొట్టాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాకు ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరో, హీరోయిన్లతో పాటు బ్రహ్మాజీ, గోపరాజు విజయ్ తదితరులు ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

తరుణ్ భాస్కర్ సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర