AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026: సెమీస్ గండం.. సూర్య సేన ముందున్న అసలు సిసలు పరీక్ష ఇదే

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 తొలి పోరులో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

T20 World Cup 2026:  సెమీస్ గండం.. సూర్య సేన ముందున్న అసలు సిసలు పరీక్ష ఇదే
Suryakumar Yadav
Rakesh
|

Updated on: Feb 23, 2026 | 4:50 PM

Share

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 తొలి పోరులో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ ఓటమితో సెమీఫైనల్ చేరడం భారత్‌కు ఇప్పుడు గగనంగా మారింది. మరి ఇక్కడి నుంచి టీమిండియా సెమీస్ చేరాలంటే ఎలాంటి అద్భుతాలు జరగాలో ఓసారి తెలుసుకుందాం.

ముందుగా భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ చూస్తే.. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో భారత్ తలపడాల్సి ఉంది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సూర్య సేన ముందున్న ఏకైక మార్గం ఈ రెండు మ్యాచ్‌లలోనూ తప్పనిసరిగా విజయం సాధించడం. కేవలం గెలిస్తేనే సరిపోదు, సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోవడం వల్ల భారత నెట్ రన్ రేట్ ప్రస్తుతం -3.800కు పడిపోయింది. కాబట్టి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ తేడాతో గెలిచి రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం అత్యంత కీలకం.

ఇక సెమీస్ ఈక్వేషన్స్ విషయానికి వస్తే, భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ (జింబాబ్వే, వెస్టిండీస్‌లపై) విజయం సాధించాలి. ఒకవేళ సౌతాఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే, ఆ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సులభంగా సెమీస్‌కు వెళ్తుంది. అయితే, వెస్టిండీస్ లేదా జింబాబ్వేలలో ఎవరైనా సౌతాఫ్రికాను ఓడిస్తే మాత్రం రన్ రేట్ యుద్ధం మొదలవుతుంది. అప్పుడు భారత్‌కు నెట్ రన్ రేట్ మైనస్ పాయింట్‌గా మారే ప్రమాదం ఉంది.

ఒకవేళ భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోయినా, సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. ఎందుకంటే కేవలం రెండు పాయింట్లతో సెమీఫైనల్ చేరడం అసాధ్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ దశలో ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. అలాగే సొంత గడ్డపై ఆడుతున్న వెస్టిండీస్ కూడా ప్రమాదకరమైన జట్టు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ మార్కును చూపిస్తూ జట్టును ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us