AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఏపీ, తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ ప్రకటన

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. రానున్న మూడో రోజుల్లో కూడా వానలు పడే అవకాశం ఉండటంతో రైతుల పంటకు నష్టం జరగనుంది.

Weather Report: ఏపీ, తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ ప్రకటన
Rains
Venkatrao Lella
|

Updated on: May 05, 2026 | 6:51 AM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వానలు కురవనున్నాయని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇక తిరుపతి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది. పిడుగుపాటు హెచ్చరికలు ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించింది.

ఈ జిల్లాల్లో వర్షాలు

సోమవారం ప్రకాశం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వానలు కురిశాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయగా.. పిడుగులు కూడా పడ్డాయి. అటు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కరుస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం కృష్ణా జిల్లాలో 43.9 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. 74 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా టెంపరేచర్ నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన

ఇక తెలంగాణలో కూడా అకాల వర్షాలు కరుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు కూడా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్నాయని స్పష్టం చేసింది. సోమవారం ఖమ్మం జిల్లాలో వర్షాలు పడ్డాయి. కుసుమంచిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదవ్వగా.. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 3 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెంటీమీర్లు, సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌లో 2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా వెమనపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. అకల వర్షాల క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అకాల వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం చేకూరుతుంది.

Follow Us