AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card: ఐసీఐసీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి ఛార్జీల బాదుడు.. అవి వాడేవారికి షాకే..

ఐసీఐసీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. డెబిట్ కార్డులపై వార్షిక రుసుంలను భారీగా పెంచారు. గతంలో ఉన్న సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక అంతర్జాతీయ లావాదేవీలు చేసేవారికి కూడా ఛార్జీలు పెరగనున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Debit Card: ఐసీఐసీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి ఛార్జీల బాదుడు.. అవి వాడేవారికి షాకే..
Debit Card
Venkatrao Lella
|

Updated on: May 25, 2026 | 9:06 AM

Share

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. జూన్ 21వ తేదీ నుంచి రూల్స్ మారబోతున్నాయి. డెబిట్ కార్డులు వాడేవారికి షాక్ తగలనుంది. డెబిట్ కార్డు ద్వారా చేసే అంతర్జాతీయ లావాదేవీలు, విదేశాల్లో నమోదైన వ్యాపారుల వద్ద చేసే దేశీయ లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలు పెరగనున్నాయి. అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లపై డీసీసీ ఫీజు భారీగా పెరిగే అవకాశముంది. విదేశాల్లో భారత కరెన్సీలో జరిగే ట్రాన్సాక్షన్లు, ఇండియాలో విదేశాల్లో నమోదు చేసుకున్న వ్యాపారులకు ఇండియన్ కరెన్సీలో చేసే లావాదేవీలకు డీసీసీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు ఇప్పుడు భారీగా పెరగనున్నాయి.

ఎంత పెరుగుతుందంటే..?

ఇక డీసీసీ ఛార్జి ప్రతీ లావాదేవీ విలువలో 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరుగుతుంది. అర్హత గల ప్రతీ లావాదేవీకి ఈ రేట్లు వర్తిస్తాయి. జూన్ 21 తర్వాత చేయబడే ప్రతీ లావాదేవీకి ఇవి వర్తించనున్నాయి. ఇక పలు డెబిట్ కార్డులపై వార్షిక, ఇతర ఫీజులను ఐసీఐసీఐ సవరించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ కోరల్ ప్లస్ డెబిట్ కార్డుపై రూ.249 నెలవారీ ఫీజు ఉండగా.. ఇక నుంచి వార్షిక ఫీజు రూ.2,499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కోరల్ పేవేవ్, కోరల్ చిప్, కోరల్ మాస్టర్ కార్డ్, రూపే కోరల్ డెబిట్ కార్డులపై వార్షిక ఫీజులను పెంచింది. ప్రస్తుతం రూ.699 ఉండగా.. దీనిని రూ.749కి పెంచారు.

వీటిపై కూడా పెంపు..

అలాగే పేవేవ్ ఎక్స్‌ప్రెషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ పేవేవ్, ఎక్స్‌ప్రెషన్స్ మాస్టర్ కార్డ్, ఎన్ఆర్ఈ ఎక్స్‌ప్రెషన్స్ డెబిట్ కార్డులపై వార్షిక రుసుంలను ఏడాదికి రూ.749కి పెంచారు. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలను అమల్లోకి రానున్నాయి. ఇక రూబిక్స్ డెబిట్, రూబిక్స్ మాస్టర్ కార్డ్, రూపే రూబిక్స్ కార్డులపై వార్షిక ఫీజులను రూ.1299కి పెంచారు. ఇక సఫైరో డెబిట్ కార్డ్, సఫైరో మాస్టర్ కార్డ్, రూపే సఫైరో డెబిట్ కార్డులపై వార్షిక రుసుంలను రూ.2499కి పెంచారు.

Follow Us
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!