AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా రూపం కనిపిస్తోంది- హోంమంత్రి అమిత్ షా

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజానికి చెందిన సాంస్కృతిక అస్తిత్వం, విశ్వాసాలు, సాంప్రదాయ జీవన విలువల ప్రదర్శనలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ చారిత్రాత్మక మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నర మందికిపైగా గిరిజనలు హాజరయ్యారు. ఈ వేడుల్లో కేంద్ర హోమంత్రం అమిత్‌షా, పలువురు ప్రముఖలు సైతం పాల్గొన్నారు.

Amit Shah: ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా రూపం కనిపిస్తోంది- హోంమంత్రి అమిత్ షా
Tribal Cultural Conclave In Delhi
Anand T
|

Updated on: May 25, 2026 | 9:01 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక సమాగమం భవ్యమైన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మహాసభను గిరిజనుల మహాకుంభంగా అభివర్ణించారు. ఈ సాంస్కృతిక సమాగమం రాబోయే అనేక సంవత్సరాల వరకు గిరిజనుల ఉనికి, అస్తిత్వం, సంస్కృతి ఉద్యమానికి ఒక కొత్త గుర్తింపునిచ్చేదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తాను భగవాన్ బిర్సాను చూడలేదని.. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న గిరిజనులలో ఆయన ప్రతిరూపం కనిపిస్తోందన్నారు. జల, జంగల్, జమీన్‌లను రక్షించేందుకు భగవాన్ బిర్సా చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రకృతి ఆరాధనే సనాతన సంస్కృతికి మూలాధారమని ఆయన అన్నారు. యూసీసీ చట్టం అనేది గిరిజనులకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గిరిజన సమాజ సంక్షేమ పనులు ప్రారంభమయ్యాయని షా గుర్తుచేశారు.

ఇక జనజాతీయ సురక్షా మంచ్ జాతీయ కన్వీనర్ గణేష్ రామ్ భగత్ మాట్లాడుతూ.. గిరిజనులలో మతమార్పిడి ప్రభావం చాలా వేగంగా కనిపిస్తోందని, ఇది మన సమాజానికి క్యాన్సర్ లాంటిదని అన్నారు. అలాగే మతమార్పిడిని తాము ఎప్పటికీ అంగీకరించబోమని, మనం మారిపోతే మన సంస్కృతి అంతమైపోతుందని జనజాతీయ సురక్షా మంచ్ జాతీయ కో-కన్వీనర్ డాక్టర్ రాజ్ కిశోర్ హన్స్ దా అన్నారు.

జనజాతీయ సురక్షా మంచ్ సభ్యుడు హర్ష్ చౌహాన్ మాట్లాడుతూ.. గిరిజన సమాజం భారతదేశాన్ని రక్షిస్తుందని అన్నారు. భారతదేశం అంతటా ఉన్న 700 కంటే ఎక్కువ గిరిజన సమాజాలు కలిసి బ్రిటీషర్లతో పోరాడాయని చెప్పారు. గిరిజనులు సనాతన ధర్మానికి మూలమని అన్నారు. ఇక తేచీ గుబిన్ మాట్లాడుతూ.. తమ తమ తెగలలో జరుగుతున్న మతమార్పిడులను వేగంగా అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మతమార్పిడిని అంగీకరించిన వారు రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందకుండా ఉండేలా, ఆర్టికల్ 314 ప్రకారం వారి రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక బుధరి తాతీ మాట్లాడుతూ.. మన మాతృశక్తి మేల్కొంటే ఆమెను ఎవరూ ఆపలేరని అన్నారు. తమ సమాజ ప్రజలు ముందుకు వచ్చి, అంతా కలిసి సమాజాన్ని రక్షించుకోవడానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ రోజు తమ సమాజాన్ని రక్షించుకుంటేనే రాబోయే తరాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇక గిరిజన కమిషన్ సలహాదారు, మాజీ న్యాయమూర్తి ప్రకాష్ ఉయికే మాట్లాడుతూ.. మిషనరీల మాటల వల్లే బిర్సా ముండాను జైల్లో పెట్టారని.. జైలులో ఉన్నప్పుడు కూడా భగవాన్ బిర్సా ముండాను చూసి బ్రిటీష్ ప్రభుత్వం భయపడేదని చెప్పారు. ఆయన జీవితం మొత్తం జల, జంగల్, జమీన్ కాపాడటానికే అకింతం చేశారన్నారు.

వనవాసి కళ్యాణ్ ఆశ్రమం జాతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బిర్సా ముండా గిరిజనులందరికీ దైవస్వరూపుడైన ఆదర్శ పురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఆయన గిరిజన సమాజానికి కుంభమేళాగా అభివర్ణించారు. బిర్సా ముండా బ్రిటీషర్లతో పోరాడారని, మతమార్పిడులను అరికట్టడానికి పోరాడారని. గిరిజన సమాజం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహకరిస్తూ వస్తోందని, మున్ముందు కూడా అలాగే ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us