AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!

Mercury Transit in Cancer: జూన్ 23న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా శుభపరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు, అదనపు సంపాదన, ఆర్థికాభివృద్ధితో పాటు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి జూలై 7 వరకు అనుకూల ఫలితాలు కనిపించవచ్చు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 6:29 PM

Share
అదనపు ఆదాయానికి, ఆర్థికాభివృద్ధికి, నైపుణ్యాలకు కారకుడైన బుధుడు ఈ నెల(జూన్) 23 న తన సొంత రాశి అయిన మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని రాశులకు సరికొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. జూలై 7 వరకు కర్కాటక రాశిలో కొనసాగబోతున్న బుధుడి వల్ల అదనపు సంపాదన, అదనపు రాబడి పెరగడంతో పాటు, కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు అన్ని విధాలా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది.

1 / 7
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ఆర్థికపరమైన సమస్యలు, చిక్కులు, ఒత్తిళ్లు, వివాదాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.

2 / 7
కర్కాటకం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగడం, బాగా బిజీ అయిపోవడం వంటివి జరుగుతాయి. నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకుంటారు. ఊహించని స్థాయిలో పొదుపు పాటిస్తారు.

3 / 7
కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఆస్తి ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి.

4 / 7
తుల: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా భారీ జీతభత్యాలతో కూడిన విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారదలచుకున్న ఉద్యోగులకు ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసి వస్తుంది.

5 / 7
మకరం: ఈ రాశికి భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్  పెరుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనిక కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

6 / 7
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించి, డిమాండ్ పెరుగుతుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

7 / 7
Follow Us