గుడ్డు ఫ్రెష్‌గా ఉందా.. లేదా.. ఇంట్లోనే ఇలా కనిపెట్టండి.. సెకన్లలోనే..

 Krishna

17 June 2026

గుడ్లలో ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, కుళ్లిపోయిన లేదా పాడైపోయిన గుడ్లను తినడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి తాజాదనాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యం.

ఆరోగ్యానికి ముప్పు

ఒక గ్లాసు లేదా గిన్నెలో చల్లని నీటిని తీసుకుని అందులో గుడ్డును వేయాలి. గుడ్డు నీటి అడుగు భాగంలో నిలువుగా లేదా అడ్డంగా స్థిరంగా ఉంటే అదితాజాదని అర్థం. ఒకవేళ అది నీటిపై తేలితే పాడైపోయిందని గ్రహించాలి.

నీటి టెస్ట్

గుడ్డును చెవి దగ్గరకు తీసుకెళ్లి మెల్లగా కదిలించాలి. తాజా గుడ్డు నుండి ఎలాంటి శబ్దం రాదు. అదే పాతదైతే లోపల నీళ్లలాంటి శబ్దం వినిపిస్తుంది. దీనిబట్టి అది తినడానికి మంచిది కాదని తెలుసుకోవచ్చు.

శబ్దం

గుడ్డును ఒక బలమైన కాంతి లేదా టార్చ్ లైట్ వెలుతురుకు ఎదురుగా ఉంచి చూడాలి. తాజా గుడ్డులో లోపలి భాగం పెద్దగా కనిపించదు. అదే పాత గుడ్డు అయితే లోపల గాలి బుడగ పెద్దదిగా స్పష్టంగా కనిపిస్తుంది.

టార్చ్ లైట్

 తాజా గుడ్డుపై పెంకు శుభ్రంగా, కొద్దిగా గరుకుగా ఉంటుంది. ఒకవేళ పెంకుపై పగుళ్లు, జిగట లేదా పౌడర్ లాంటి పొర కనిపిస్తే, అది బ్యాక్టీరియా చేరి పాడైపోయిందనడానికి సంకేతం.

పెంకు పరిశీలన

గుడ్డును పగులగొట్టినప్పుడు దాని లోపలి పచ్చసొన గుండ్రంగా, పైకి ఉబ్బినట్లు ఉండి, తెల్లసొన చిక్కగా ఉంటే అది తాజాది. పాత గుడ్డులో పచ్చసొన త్వరగా విడిపోయి వ్యాపిస్తుంది, తెల్లసొన పల్చగా మారుతుంది.

సొన ఆకృతి

గుడ్డు పాడైపోయిందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం వాసన చూడటం. గుడ్డు పగులగొట్టినప్పుడు కుళ్ళిన సల్ఫర్ వంటి ఘాటైన దుర్వాసన వస్తే దానిని వెంటనే పారేయాలి. తాజా గుడ్లకు ఎలాంటి వింత వాసనలు ఉండవు.

వాసన

ప్రస్తుతం మార్కెట్లో పాత గుడ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని, ముఖ్యంగా ఆన్‌లైన్ డెలివరీల్లో ఇలాంటివి వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఈజీ చిట్కాలతో గుడ్డు నాణ్యతను ఇంట్లోనే చిటికెలో తెలుసుకోండి.

మార్కెట్ మోసాలు