AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం.. భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్! భారత్‌లో ఆగ్రహ జ్వాలలు!

జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారతదేశం నుంచి విడిగా చూపినట్లు గమనించారు. భారత దృష్టిలో ఇది దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం.. భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్! భారత్‌లో ఆగ్రహ జ్వాలలు!
Us On India Map
Balaraju Goud
|

Updated on: Jun 17, 2026 | 3:08 PM

Share

అమెరికా రక్షణ శాఖ (Department of War/Defense) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి అమల్లో ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరును తిరిగి యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చింది. ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఈ పేరు మార్పు కంటే, దానితో పాటు విడుదల చేసిన భారతదేశ పటమే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారతదేశం నుంచి విడిగా చూపినట్లు గమనించారు. భారత దృష్టిలో ఇది దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

భారతదేశం ఎప్పటి నుంచో మొత్తం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను తన అంతర్భాగంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక అంతర్జాతీయ వేదికలపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. అందువల్ల అమెరికా అధికారిక కమ్యూనికేషన్‌లో ఇలాంటి మ్యాప్ ఉపయోగించడం సున్నితమైన అంశంగా మారింది.

అయితే అమెరికా రక్షణ శాఖ మాత్రం పేరు మార్పు వల్ల కమాండ్ బాధ్యతలు, వ్యూహాత్మక పరిధి, కార్యకలాపాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. 1947 నుంచి 2018 వరకు అమల్లో ఉన్న చారిత్రక పేరును పునరుద్ధరించడమే లక్ష్యమని పేర్కొంది. కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దుల వరకు యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.

అయితే “ఇండో-పసిఫిక్”లోని “ఇండో” పదాన్ని తొలగించడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక సంకేతం ఉందా అనే చర్చ మొదలైంది. 2018లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం భారతదేశ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ.. “పసిఫిక్ కమాండ్”ను “ఇండో-పసిఫిక్ కమాండ్”గా మార్చింది. ఇప్పుడు ట్రంప్ రెండో విడత పాలనలో తిరిగి పాత పేరును తీసుకురావడం విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Usindopacom Map

Usindopacom Map

ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గతంలో కూడా అమెరికా ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన మ్యాప్‌లపై వివాదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో PoK, అక్సాయ్ చిన్‌లను భారత్‌లో భాగంగా చూపిన మ్యాప్‌లను అమెరికా సంస్థలు తర్వాత తొలగించాయి. భారత్-అమెరికా సంబంధాలు ప్రస్తుతం రక్షణ, వాణిజ్య, క్వాడ్ సహకారంలో బలంగా ఉన్నప్పటికీ, ఈ మ్యాప్ వివాదం రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన సున్నితత్వాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. PoKపై భారతదేశం తన హక్కును భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాశ్మీర్‌ను కట్ చేసిన అమెరికా.. భారత్‌ ఆగ్రహం
కాశ్మీర్‌ను కట్ చేసిన అమెరికా.. భారత్‌ ఆగ్రహం
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..