జీతం సరిపోవడం లేదా? చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలు మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి
samatha
25 may 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దానిలో మానవులకు ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
నీతి శాస్త్రం పుస్తకం
బంధాలు, బంధుత్వాలే కాకుండా, చాణక్యుడు డబ్బుకు సంబంధించి కూడా చాలా విషయాలు తెలిపాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే తప్పకుండా ఐదు అలవాట్లు ఉండాలి అన్నారు. అవి ఏవి అంటే?
బంధాలు, బంధుత్వాలు
ఎప్పుడూ కూడా మీరు సంపాదించేదానిలో దాదాపు 25 శాతం పొదుపు చేసుకోవాలి. అప్పుడే మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు.
25 శాతం పొదుపు
అలాగే ఎప్పుడూ కూడా పెట్టుబడులు పెట్టడం చేయాలి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. పెట్టుబడులు పెట్టకపోతే డబ్బు పెరగదు. ఇది గుర్తుంచుకోవాలి.
పెట్టుబడులు పెట్టడం
ఖర్చులు తగ్గించుకోవాలి. మీ ఆదాయానికి మించి డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదు , ఇది మీకు అనేక సమస్యలకు కారణం అవుతుంది.
ఖర్చులు తగ్గించుకోవడం
ఎప్పటికైనా సరే సరైన మార్గంలో డబ్బు సంపాదిస్తేనే అది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. అందువలన అక్రమ మార్గంలో ఎప్పుడూ డబ్బు సంపాదించకూడదు.
అక్రమ మార్గంలో సంపాదించకూడదు
అలాగే మీరు ఏం చేయాలి అనుకునేది, మీ జీవిత లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇది అనేక ఆర్థికపరమైన సమస్యలకు కారణం అవుతుంది.