AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఒకప్పుడు హీరోగా తెలుగులో చక్రం తిప్పిన పలువులు తారలు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు. తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..
G Nageswara Reddy
Rajitha Chanti
|

Updated on: May 25, 2026 | 9:14 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి సుపరిచితమే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం “సిక్స్టీన్స్” సినిమాతో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందు ఎదుర్కొన్న ప్రయాణాన్ని, సవాళ్లను వివరంగా వెల్లడించారు. తన కెరీర్ ఆరంభంలో, ఆయన శ్రీకాంత్, జగపతిబాబు, రాజశేఖర్, సాయి కుమార్, శ్రీహరి వంటి ప్రముఖ నటులతో సినిమా చేయాలని తెలిపారు. రాజశేఖర్ అయితే నువ్వు పెద్ద దర్శకుడివి అవుతావు అని మొదట చెప్పిన హీరో అని జి. నాగేశ్వర రెడ్డి గుర్తు చేసుకున్నారు. అయితే, బిజీ షెడ్యూల్స్, బడ్జెట్ వంటి కారణాల వల్ల ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విచిత్ర పరిస్థితి ఉండేది. కొత్త తెలుగు దర్శకులకు తగినంత గుర్తింపు, అవకాశాలు లభించక, తమిళ దర్శకుల ఆధిపత్యం స్పష్టంగా ఉండేదని ఆయన వివరించారు. 16s చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన రోహిత్ గురించి పలు ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

నాగేశ్వరరెడ్డి తన తొలి చిత్రమైన ’16s’ కోసం నలుగురు కొత్త కుర్రాళ్లను ఎంపిక చేసుకునే క్రమంలో రోహిత్‌ను హీరోగా సెలెక్ట్ చేశారు. ఆ సమయంలో సినిమా నిర్మించడానికి సరైన బడ్జెట్ ,ఆర్థిక సాయం లేకపోవడంతో, ఆడియో రికార్డింగ్ కోసం నలుగురు హీరోల నుండే తలా కొంత డబ్బు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఆ క్రమంలో హీరో రోహిత్ స్వయంగా రూ. 15,000 ఇచ్చి సినిమా పాటల రికార్డింగ్‌కు ఎంతగానో సహకరించారని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. ఆ పాటలు తదనంతరం ఆడియో పరంగా భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

రోహిత్ కెరీర్ గురించి మాట్లాడుతూ, నాగేశ్వరరెడ్డి రోహిత్‌తో కలిసి మొత్తం నాలుగు సినిమాలు చేశానని, అందులో రెండు హిట్లు, రెండు ఫ్లాపులు ఉన్నాయని చెప్పారు. అయితే రోహిత్ ఒక స్టార్ హీరోగా ఎదగకపోవడానికి గల కారణాలను తెలిపారు. ఇండస్ట్రీ ఎవరికీ అన్యాయం చేయదని, మనకు దొరికిన అదృష్టాన్ని లేదా అవకాశాన్ని సరిగ్గా వాడుకోకపోవడం వల్లే నష్టపోతామని స్పష్టం చేశారు. రోహిత్ అద్భుతమైన డాన్సర్ అని, మంచి హైట్,రూపం ఉన్న అందగాడని.. నేటికీ అతను మంచి పొజిషన్‌లో ఉండాల్సిన హీరో అని అన్నారు. కానీ ఆ సమయంలో సరైన మెచ్యూరిటీ (పరిణతి) లేకపోవడం, వచ్చిన సక్సెస్‌ను చూసి ఇక తనకు తిరుగులేదు అనే అపోహలో ఉండిపోవడం, రెమ్యునరేషన్ వంటి విషయాలను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే రోహిత్ స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయాడని నాగేశ్వరరెడ్డి ఓపెన్‌గా వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

Rohit

Rohit

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us