AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే.. లక్నోపై రోహిత్ శర్మ సృష్టించిన మూడు భారీ రికార్డులు ఇవే

Rohit Sharma : గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్, మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. సోమవారం LSGతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.

Rohit Sharma : ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే.. లక్నోపై రోహిత్ శర్మ సృష్టించిన మూడు భారీ రికార్డులు ఇవే
Rohit Sharma
Rakesh
|

Updated on: May 05, 2026 | 7:02 AM

Share

Rohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకున్న అసలైన వినోదాన్ని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందించాడు. గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్, మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మూడో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికీ ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ ఏకంగా మూడు అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

లక్నోపై మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ

రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది రోహిత్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై రోహిత్ చేసిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా కూడా ఇది రికార్డు క్రియేట్ చేసింది. గతంలో రోహిత్ కేకేఆర్‌పై 23 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన రికార్డు ఉంది.

లక్నోపై కెరీర్ బెస్ట్ స్కోరు

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి రోహిత్ ఆ జట్టుపై భారీ స్కోర్లు చేయడానికి కొంత ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి ఆ అడ్డంకిని చెరిపివేశాడు. 2024 సీజన్‌లో లక్నోపై రోహిత్ చేసిన 68 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. అయితే తాజా మ్యాచ్‌లో 84 పరుగులు చేయడం ద్వారా లక్నోపై తన వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డును రోహిత్ తిరగరాశాడు.

ముంబై చరిత్రలో టాప్ భాగస్వామ్యం

రోహిత్ శర్మ మరియు రాయన్ రికెల్టన్ జంట మైదానంలో పరుగుల వరద పారించింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో సూర్యకుమార్ యాదవ్ – తిలక్ వర్మ జోడీ కూడా 143 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు చేసింది. ముంబై తరపున అత్యధిక భాగస్వామ్యం రికార్డు ఇప్పటికీ రోహిత్ – గిబ్స్ (167 పరుగులు) పేరిటే ఉంది.

గత ఐదు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ లేని లోటు ముంబై బ్యాటింగ్ లైన్-అప్‌లో స్పష్టంగా కనిపించింది. కానీ వాంఖడే స్టేడియంలో తన సొంత అభిమానుల మధ్య రోహిత్ చేసిన ఈ 84 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు ఊపిరి పోసింది. ముఖ్యంగా 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం వల్ల 229 పరుగుల భారీ లక్ష్యం కూడా ముంబైకి చాలా చిన్నదిగా అనిపించింది. రోహిత్ అవుట్ అయ్యే సమయానికే ముంబై విజయం ఖాయమైపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us