Telugu News » Photo gallery » These are top 10 searched people on google 2022 in india Telugu News
Google Year in Search 2022: గూగుల్ సెర్చ్ 2022 లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన 10మంది ప్రముఖులు వీళ్లే..
Jyothi Gadda |
Updated on: Dec 09, 2022 | 10:22 AM
2022 ముగుస్తున్న సందర్బంగా గూగుల్ ఇండియా “ఇయర్ ఇన్ సెర్చ్ 2022” ఫలితాలను విడుదల చేసింది. నెటిజన్లు సినీ ప్రముఖులు,ఆసక్తికరమైన ఆలోచనలు, రాజకీయ పరిణామాల కోసం వెతకడం మామూలే. అయితే ఇప్పుడు విడుదల చేసిన లిస్ట్‌లో ఊహించలేని వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో భారత రాజకీయవేత్త నుపుర్ శర్మ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికన్ నటి అంబర్ హెడ్ మాత్రమే ఈ జాబితాలోకి వచ్చిన విదేశీయురాలు. ఆమె పదో స్థానంలో నిలిచింది.
Dec 09, 2022 | 10:22 AM
భారతదేశ రాజకీయవేత్త నూపుర్ శర్మ కోసం 2022లో గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా శోధించారు.. ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి.
1 / 10
ద్రౌపది ముర్ము భారతీయ రాజకీయవేత్త. ఆమె 25 జూలై 2022 నుండి భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా నియమించబడ్డారు. ఆమె గిరిజన సమాజానికి చెందిన మొదటి వ్యక్తి. ప్రతిభా పాటిల్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ.
2 / 10
రిషి సునక్ బ్రిటీష్ రాజకీయ నాయకుడు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని. 2019 నుండి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా, 2020 నుండి 2022 వరకు ఆర్థిక మంత్రి పని చేశాడు. ఋషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నుండి 2015లో రిచ్‌మండ్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
3 / 10
భారత వ్యాపారవేత్త లలిత్ మోదీ నాలుగో స్థానంలో నిలిచారు. క్రికెట్‌ను ప్యూర్ క్యాపిటల్ గేమ్‌గా మార్చిన వ్యక్తి లలిత్ మోడీ. ఆయన కుటుంబం తరతరాలుగా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. లలిత్ మోదీకి కూడా సొంత వ్యాపార సామ్రాజ్యం ఉంది. నటి సుస్మితా మోడీతో అనుబంధం కారణంగా అతను 2022 గూగుల్‌లో టాప్ సెర్చ్‌లో ఉన్నాడు.
4 / 10
గూగుల్ టాప్ 10 సెర్చ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఇండియా సినీ ప్రముఖులలో సుస్మితా సేన్ ఒక్కరే ఉన్నారు. ఈ ఏడాది సుస్మితా సేన్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో తనకున్న సంబంధాల గురించి ఎక్కువగా చర్చించారు. మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు.
5 / 10
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలి అరోరా ఆరో స్థానంలో నిలిచారు. నటి కంగనా రనౌత్ రియాల్టీ షో లాకప్ పోటీదారు అంజలి అరోరా. ఈ ఏడాది లాకప్ షో కారణంగా అంజలి అరోరా వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఎంఎంఎస్ లీక్ కావడంతో ఆమె వివాదంలో చిక్కుకుంది.
6 / 10
బిగ్‌బాస్ ఫేమ్ అబ్దు రోజ్జిక్ ఏడో స్థానం పొందారు. బిగ్‌బాస్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అబ్దు రోజిక్ కూడా లిస్ట్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీలలో ఒకరు. ఆసక్తికరంగా, బిగ్ బాస్ సీజన్ 16 నుండి జాబితాలో అతని పేరు కనిపించిన ఏకైక కంటెస్టెంట్.
7 / 10
ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిగా, ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
8 / 10
ప్రవీణ్ విజయ్ తాంబే ఇండియన్ క్రికెట్ ఆటగాడు. తాంబే తన 41 సంవత్సరాల వయస్సులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసాడు. IPL అరంగేట్రం చేసిన అత్యంత వయస్కుడిగా నిలిచాడు. ప్రవీణ్ తాంబే పూర్తి పేరు ప్రవీణ్ విజయ్ తాంబే. అలాగే అతన్ని అందరూ ముద్దుగా PT అని పిలుస్తారు.
9 / 10
అమెరికన్ నటి అంబర్ హెడ్. జానీ డెప్ మాజీ భార్య, భారతదేశంలోని టాప్ సెర్చ్ సెలబ్రిటీ లిస్ట్ 2022లో ఉన్నారు. ఆమె జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.