- Telugu News Photo Gallery World photos Unique new year celebrations in these countries know the details in telugu
New Year 2023: ఈ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో వింత సాంప్రదాయం.. ద్రాక్ష తినడం, ప్లేట్స్ పగల గొట్టడం వంటివి రీజన్ ఏమిటో తెలుసా..
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023 లో అడుగు పెట్టనున్నాం.. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి దేశం కొత్త సంవత్సర వేడుకలను విభిన్నమైన పద్ధతిలో జరుపుకుంటారు. భారతీయులు న్యూ ఇయర్ వేడుకలను ఇంట్లో లేదా బయట న్యూ ఇయర్ వేడుకలను కేక్ కట్ చేసి.. సరదాగా ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతారు. వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు వాటి విశిష్ట సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.
Surya Kala | Edited By: Anil kumar poka
Updated on: Dec 12, 2022 | 3:13 PM

ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరానికి భిన్న పద్ధతుల్లో స్వాగతం చెప్పే సంప్రదాయం ఉంది. అదే విధంగా కొన్ని దేశాలు నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకమైన సంప్రదాయాలల్లో జరుపుకుంటారని తెలుసా.. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు వాటి విశిష్ట సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.

స్పెయిన్: స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. స్పెయిన్‌లో.. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనా వంటి పెద్ద నగరాల్లో.. ద్రాక్షను కలిసి తినడానికి ప్రధాన కూడలిలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు.

డెన్మార్క్: డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం.

అమెరికా: న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు తమ టీవీ ముందు కూర్చుంటారు. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్‌ను చూడడానికి వారు ఇలా చేస్తారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టె సమయంలో కొత్త ప్రధాన కార్యాలయంలో బాల్ డ్రాప్‌ను చూసే ఈ అలవాటు న్యూ ఇయర్ వేడుకలలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంప్రదాయాలలో ఒకటి.

బ్రెజిల్: బ్రెజిల్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

ఫిన్లాండ్: ఫిన్లాండ్‌లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్‌ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు.





























