Fire In Restaurant: బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఎగిసిపడ్డ మంటలు..
చాలా రోజులుగా గ్యాస్ లీకేజీతో దుర్వాసన వెదజల్లుతున్నట్లు చుట్టుపక్కల జనాలు చెబుతున్నారు. స్థానికులు, దుకాణదారుల ఫిర్యాదును హోటల్ యజమాని పట్టించుకోలేదని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని చార్‌బాగ్‌లో బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నాసిక్ నివాసి ప్రకాష్ సుధాకర్ దాత్రే (30) మృతి చెందగా, అతని సహోద్యోగి అనీస్ షేక్ 40 శాతం కాలిన గాయాలతో బయటపడ్డాడు.
ఎల్‌పీజీ సిలిండర్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. హోటల్‌లో అమర్చిన సామాగ్రితో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం చేయడంతో కేవలం గంట వ్యవధిలో మంటలు అదుపులోకి వచ్చాయి. చాలా రోజులుగా గ్యాస్ లీకేజీతో దుర్వాసన వెదజల్లుతున్నట్లు చుట్టుపక్కల జనాలు చెబుతున్నారు. స్థానికులు, దుకాణదారుల ఫిర్యాదును హోటల్ యజమాని పట్టించుకోలేదని ఆరోపించారు.
బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్‌లో కిచెన్ బయట నిర్మించబడింది. అక్కడికి వచ్చిన కస్టమర్లు లోపల కూర్చుని భోజనం చేసేవారు. గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో వెంటనే అది డోర్‌కు వ్యాపించింది. బయటికి రాలేక లోపల ఉన్నవారు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. తీవ్ర తొక్కిసలాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఒకరు చనిపోయారని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి