Health Tips: ఈజీగా బరువు తగ్గించే ఇడ్లీ సాంబర్‌.. ఎంచక్కా బరువు తగ్గొచ్చు తెలుసా?

బరువు తగ్గటానికి చాలా మంది సర్కాస్‌ ఫీట్లు చేస్తుంటారు. అయితే ఇడ్లీ-సాంబార్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? చాలా మంది బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవుతారు.

Health Tips: ఈజీగా బరువు తగ్గించే ఇడ్లీ సాంబర్‌.. ఎంచక్కా బరువు తగ్గొచ్చు తెలుసా?
Idlis Vada
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2022 | 7:25 AM

గత కొన్నేళ్లుగా చాలా మందిని వేధిస్తున్న సమస్య బరువు పెరగడం ఊబకాయం. ఇది కేవలం సరైన ఆహారం, జీవనశైలి వల్ల మాత్రమే కాదు. ఇది మందుల దుష్ప్రభావాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు. బరువు తగ్గడానికి ప్రజలు తమ జీవనశైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. కానీ వాటిని సరిగ్గా చేయడంలో విఫలమవుతున్నారు. దాంతో బరువు తగ్గడం కష్టంగా మారి ఊబకాయం సమస్య పెరుగుతోంది. వాకింగ్, వర్కవుట్, డైటింగ్ ఇలా రకరకాల పద్ధతులను అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవటానికి ప్రజలు నానా విధాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది సర్కాస్‌ ఫీట్లు చేస్తుంటారు. అయితే ఇడ్లీ-సాంబార్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? చాలా మంది బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవుతారు. ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వదిలేసి పచ్చి కూరగాయలు, పండ్లు, మొలకలు తింటూ కాలయాపన చేస్తున్నారు. ఇష్టమైన చిరుతిళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా చేత్తో ముట్టరు. అయితే, ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌ ఇడ్లీ-సాంబార్, చట్నీతో పాటు తినండి. సాధారణంగా అన్ని హోటళ్లలో ఇడ్లీ సాంబార్ లాంటివి ఉంటాయి. సాంబార్‌లో ముంచిన వేడి వేడి ఇడ్లీ అద్భుతమైన రుచినిస్తుంది. తింటుంటే స్వర్గంలో తేలినట్టుంటుంది భోజన ప్రియులకు. అయితే బరువు తగ్గడానికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నది కూడా నిజం. చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ ఒకటి. దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఇడ్లీలు తింటారు. కొబ్బరి చట్నీతో ఇడ్లీ రుచిగా ఉంటుంది. నిజానికి ఇడ్లీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇడ్లీ చేయడానికి బియ్యం ఎక్కువగా అవసరం. కానీ మీరు తక్కువ పిండి పదార్థాలు తీసుకోవాలనుకుంటే మీరు బియ్యం మొత్తాన్ని తగ్గించి, బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని పెంచుకోవచ్చు. ఈ పిండిలో కూరగాయలు, ఆరోగ్యకరమైన మసాలా దినుసులు కూడా జోడించవచ్చు.

బరువు తగ్గడానికి ఏ ఇడ్లీ మంచిది : మినపప్పు ఇడ్లీ, ఓట్స్‌ ఇడ్లీ కూడా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. ఓట్స్ ఇడ్లీ సాంప్రదాయ ఇడ్లీకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఓట్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

పులిసిన పిండితో ఇడ్లీలు తయారు చేస్తారు. పులియబెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరంలోని విటమిన్లు, ఖనిజాలు విచ్ఛిన్నమవుతాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా, పులియబెట్టిన ఆహారాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గట్‌లోని pH బ్యాలెన్స్‌ను మారుస్తుంది. ఇది దీర్ఘాయువు, మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గడానికి సాంబార్ : బరువు తగ్గడానికి సాంబార్ విషయానికి వస్తే, ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే సాంబార్‌లో ఎక్కువ కూరగాయలను జోడించండి. అలాగే, మీ శరీరంలో కార్బోహైడ్రేట్లు పేరుకుపోకుండా నిరోధించడానికి ఇడ్లీ పిండిలో కొంచెం సిట్రస్ జ్యూస్‌ను జోడించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్