Skin Care tips:చలికాలంలో ఇలాంటి మార్నింగ్ స్కిన్ కేర్ చిట్కాలు ట్రై చేయండి.. పట్టులాంటి చర్మంతో మెరిసిపోతారు..

చలికాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు చక్కటి ఫలితాన్నిస్తాయి. చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఫేసును క్లీన్ గా కడుక్కోవాలి. మీరు ముఖానికి మేకప్ ఉపయోగిస్తే, మీరు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ ను తొలగించాలి.

Skin Care tips:చలికాలంలో ఇలాంటి మార్నింగ్ స్కిన్ కేర్ చిట్కాలు ట్రై చేయండి.. పట్టులాంటి చర్మంతో మెరిసిపోతారు..
Skin Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2022 | 6:53 AM

చలి చంపేస్తోంది. తీవ్రమైన చలితో పిల్లల నుంచి పెద్దల దాకా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలనుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, చలికాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు చక్కటి ఫలితాన్నిస్తాయి. చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఫేసును క్లీన్ గా కడుక్కోవాలి. మీరు ముఖానికి మేకప్ ఉపయోగిస్తే, మీరు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ ను తొలగించాలి. రాత్రి వేళ ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది. అంతేకాదు ముఖంపై మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది. ఇక చర్మ సంరక్షణలో భాగంగా సీరమ్స్ వాడకం కూడా మంచి ఫలితానిస్తుంది.

చలికాలంలో చర్మ సంరక్షణకు సీరమ్ చాలా ఉపయోగపడుతుంది. మెరిసే చర్మానికి ఈ సీరం చాలా మంచిదని చాలా మంది భావిస్తారు. కాబట్టి చలికాలంలో రాత్రి పూట ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి సీరమ్ రాసుకోవాలి. సీరమ్ అప్లై చేయడం వల్ల మీ ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.. అంతేకాదు మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది. సీరమ్ చాలా తేలికగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే రాత్రి వేళ చర్మ సంరక్షణ కోసం సీరమ్ అప్లై చేసేయండి.

చలికాలంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలుష్యం, హానికరమైన UV కిరణాల బారిన పడుతూ రోజూ మన చర్మం పలు కారణాల వల్ల పాడవుతూ ఉంటుంది. అందుకే చలికాలంలో వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చక్కని ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ ట్రై చేయండి. దీని వల్ల మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మీరు మెరిసే చర్మం కావాలంటే చలికాలంలో రాత్రి వేళ మీ చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజింగ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏ రకమైన చర్మమైనా తేమను నిలుపుకోవడానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ చర్మం pH స్థాయిని నిర్వహిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు తేలికపాటి నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు తీసుకొని, ఈ రెండిటిని పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత కొద్దిగా నీరు చిలకరించి మసాజ్ చేసుకోవాలి. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ , పాలలోని మాయిశ్చరైజింగ్ గుణాలు వింటర్ స్కిన్ కేర్ కు చాలా అవసరం. చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. మెరిసేలా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది.

ఎండాకాలం అయినా, చలికాలం అయినా చర్మంపై ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. ఇది ఎండ,వేడి నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా, చర్మాన్ని మురికి లేదా దుమ్ము నుండి కూడా రక్షిస్తుంది. మంచి సన్‌స్క్రీన్ కూడా గ్లోను తెస్తుంది. చలికాలంలో చర్మం పగిలిపోతుంది. దురద, చికాకు,మంట పుడుతుంది. ఇలా ఉంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ఉపయోగించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి