Ear Pain: చెవి నొప్పి చంపేస్తోందా..? అయితే, ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించండి..ఉపశమనం పొందుతారు..
సహజ కారణల వల్ల వచ్చే చెవినొప్పిని తగ్గించుకోవటానికి కొన్ని హోం రెమెడిసీ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు, చిట్కాలు గురించి
చెవి నొప్పి కంటికి కనిపించకుండా చాలా బాధ కలిగిస్తుంది. ఈ చలికాలంలో చెవి నొప్పి ఎక్కువగా వేధిస్తుంటుంది. చెవి నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కూడా చాలా ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి నొప్పికి దారి తీస్తుంది. వర్షంలో తడటం వల్ల కూడా తీవ్రమైన చెవి నొప్పి సమస్యలు వస్తాయి. ఇలాంటి సహజ కారణల వల్ల వచ్చే చెవినొప్పిని తగ్గించుకోవటానికి కొన్ని హోం రెమెడిసీ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు, చిట్కాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఆలివ్ ఆయిల్.. చెవి నొప్పి తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చెవి నొప్పి ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలోకి రెండు చుక్కలు వేయాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉల్లిపాయ రసం.. చెవి నొప్పి, వాపు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే దీని నుండి ఉపశమనం కలగడానికి ఉల్లిపాయ ఎంతగానో పనిచేస్తుంది. దీని కోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వాపు ఉన్న ప్రదేశంలో రాయాలి. చెవిని పట్టి లాగడం, అటు ఇటు చేత్తో కలపడం ద్వారా కొంచెం రిలీఫ్ అవుతుంది.
పెద్దగా ఆవిలించడం విగ్లింగ్ చేయడం ద్వారా, చెవిరంద్రాల ట్యూబ్స్ పెద్దగా తెరచుకుని లోపలికి గాలి చెరి రిలీఫ్ అందిస్తుంది. వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
చెవి నొప్పిని తగ్గించడంలో ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, ఒక మెత్తటి కర్చీఫ్ లాంటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు మూటతో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే క్షణాల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం మంచిది కాదు..అలాగే ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను మీరు ఉపయోగించకుండా ఉంటే మంచిది..ఇయర్ బడ్స్ వాడటం మానేయాలి. ఇయర్ బడ్స్ చెవిలో ఇన్ ఫెక్షన్ని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇయర్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి