AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Tea: వేడి వేడి వెల్లుల్లి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా? ఈ సమయంలో అత్యవసరం కూడా..!

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Garlic Tea: వేడి వేడి వెల్లుల్లి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా? ఈ సమయంలో అత్యవసరం కూడా..!
Garlic Tea
Jyothi Gadda
|

Updated on: Dec 10, 2022 | 7:57 AM

Share

వెల్లుల్లి ఆరోగ్యానికి కలుగచేసే ప్రయోజనాలు బోలెడు. ఇది వంటలకు రుచిని అందించడంమే కాదు..అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీకు వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ..గార్లిక్ టీ కూడా తయారు చేస్తారు. ఇది తాగడానికి మాత్రమే కాదు, రుచిలో కూడా చాలా బాగుంటుంది. గార్లిక్ టీ ఆరోగ్య సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అందుకే అల్లం టీతో పాటు గార్లిక్ టీని కూడా ప్రయత్నించవచ్చు. అయితే వెల్లుల్లితో చేసుకునే టీ ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వెల్లుల్లి టీ తాగడం వల్ల మీ ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా, చలికాలంలో కూడా ఇది ఉపశమనం అందిస్తుంది. విటమిన్ ఎ, బి1, బి2 మరియు సి వెల్లుల్లిలో అత్యధిక పరిమాణంలో ఉంటాయి. దీని కారణంగా చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. గొప్పదనం ఏమిటంటే, వెల్లుల్లి టీ గుండె జబ్బులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవక్రియ, రోగనిరోధక శక్తి ఈ టీలో గరిష్టంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

వెల్లుల్లి టీ తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యలను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ వెల్లుల్లి టీని తీసుకోవడం మంచిది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బాడీ మెటబాలిజాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కనుక సాధారణ కాఫీ, టీ లకు బదులుగా వెల్లుల్లి టీ ను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

వాతావరణంలోని మార్పుల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లనుతగ్గించడానికి చక్కటి పరిష్కారంగా వెల్లుల్లి టీ సహాయపడుతుంది. కనుక జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగడం మంచిది. అలాగే అజీర్తి, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించి ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

వెల్లుల్లి టీ తయారీ విధానం.. వెల్లుల్లి టీ తయారు చేయడానికి, ముందుగా ఒక కప్పు నీటిని మరిగించి, తరిగిన అల్లం, వెల్లుల్లిని అందులో వేయండి. మీరు కనీసం 15 నుండి 20 నిమిషాల పాలు తక్కువ మంటలో మరిగించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు దానిని ఫిల్టర్ చేసి, దానికి ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలపండి. అంతే, వెల్లుల్లి టీ సిద్ధం. ఈ టీ ఉదయం ఖాళీ కడుపుతో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా ప్రతి రోజూ వెల్లుల్లి టీని చేసుకొని తాగితే శరీర ఆరోగ్యం మెరుగుపడి జీవితకాలం పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి