Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆనంద్‌ మహీంద్ర మనసు గెలుచుకున్న ‘ఆమె’.. పరమ్‌జీని కథకు నెట్టింట ప్రశంసల వర్షం..

ఇది దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ బైక్. దీని ధర కేవలం రూ.12,000 మాత్రమే. అలాగే ఈ బైక్ 8 నుండి 10 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది.

Viral News: ఆనంద్‌ మహీంద్ర మనసు గెలుచుకున్న 'ఆమె'.. పరమ్‌జీని కథకు నెట్టింట ప్రశంసల వర్షం..
Anand Mahindra
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 2:05 PM

కొంతమంది జీవితం చుట్టూ కష్టలతో కూడుకుని ఉంటుంది. జీవితంలో వైఫల్యాలు, సమస్యలు ఎదురైనప్పుడు చాలా మంది నిరుత్సాహపడతారు. కొంతమంది ధైర్యవంతులు ఈ క్లిష్ట పరిస్థితిని రెండు చేతులతో ఎదుర్కొంటారు. అటువంటి ధైర్యవంతుల అద్భుతమైన ప్రదర్శన సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లను ప్రేరేపించడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటిదే ఓ మహిళ ఈ-రిక్షా నడుపుతున్న కథనం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఈ మహిళ పేరు పరమ్‌జిత్ కౌర్. భర్త చనిపోయాక కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజస్కందాలపై పడింది. ఎంతో ధైర్యంతో కుటుంబాన్ని పోషించేందుకు ఆ మహిళ ఈ-రిక్షాలు నడపడం ప్రారంభించింది. పంజాబ్ నివాసి అయిన పరమ్‌జిత్ కౌర్ ఈ ధైర్యాన్ని చూసి దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా పరమజిత్ కౌర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇందులో ఆమె ఈ-రిక్షా నడుపుతున్నారు. ఫోటోను పోస్ట్ చేస్తూ, అతను పరమజిత్ కథను ప్రపంచంతో పంచుకున్నాడు.

ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా లైక్, షేర్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్‌ను ఇన్స్పిరేషన్‌గా చూస్తున్నారు. చాలా మంది నెటిజన్లు జీవితంలో కష్టాలను చూసి బెదిరిపోవద్దని,వాటిని కష్టపడి ఎదుర్కోవాలని అంటున్నారు. చాలా మంది వినియోగదారులు పరమ్జీ ధైర్యానికి సలాం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎల్లప్పుడూ వేర్వేరు వ్యక్తుల కథలు మరియు వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఇటీవల, ఆనంద్‌ మహీంద్ర ఒక యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ వీడియోను షేర్‌ చేశారు. అదే విషయాన్ని ప్రశంసించాడు . ఇది దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ బైక్. దీని ధర కేవలం రూ.12,000 మాత్రమే. అలాగే ఈ బైక్ 8 నుండి 10 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ. అని స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి