Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఒకదాని వెంట ఒకటి షాకింగ్ న్యూస్‌లు

వైశాలి కిడ్నాప్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు షాకింగ్‌ కి గురిచేస్తున్నాయి. వైశాలిని కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలతో నల్గొండ నుంచి విజయవాడ పారిపోతుండగా నిందితుడు నవీన్‌ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఒకదాని వెంట ఒకటి షాకింగ్ న్యూస్‌లు
Adibatla Kidnap Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 10, 2022 | 2:03 PM

ఆదిబట్ల డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. అన్నీ షాకింగ్ న్యూస్‌లే. ఓ వైపు కిడ్నాప్‌ సీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తే, మరోవైపు నవీన్‌రెడ్డి స్టేట్ మెంట్‌ కిరాక్‌ ట్విస్ట్‌ని తలపిస్తోంది. వైశాలి తన భార్య అని, 2021 ఆగస్టులో ఆమెను పెళ్లిచేసుకున్నాని చెప్పడం నవీన్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ కలకలం రేపుతోంది. అంతేకాదు బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. BDS పూర్తయ్యేవరకు ఫొటోలు బయటికి రావొద్దని వైశాలి కండీషన్‌ పెట్టిందని నిందితుడు పేర్కొన్నాడు. వైశాలి తల్లిదండ్రులు తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని, తనకిచ్చి పెళ్లి చేస్తామని మాట తప్పారని నవీన్‌ ఆరోపించాడు.

మరోవైపు నవీన్‌తో వైశాలికి వివాహం అయిందనేది అవాస్తవమన్నారు ఆమె తండ్రి దామోదర్‌రెడ్డి. 2021 ఆగస్ట్‌ 4 వతేదీ వైశాలి డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుందని, అసలు నవీన్‌తో వైశాలి లేదన్నారు. ఆర్మీ డెంటల్ ఆస్పత్రిలో వైశాలికి చికిత్స చేయించామన్నారు. దానికి సంబంధించిన బిల్స్‌ అన్ని తమ దగ్గర ఉన్నాయన్నారు. నవీన్‌రెడ్డి కోర్టును, పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు వైశాలి విషయంలో మొదటి నుంచి నవీన్‌రెడ్డి సైకోగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వైశాలిని సొంతం చేసుకునేందుకు ఎన్నో డ్రామాలు ఆడినట్లు సమాచారం. తనకు వైశాలికి పెళ్లయినట్లు నమ్మించేందుకు నవీన్‌రెడ్డి మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతేడాది ఆగస్టు 27వ తేదీన వివాహమైందని ప్రచారం చేసుకున్నాడు. తన భార్యను పంపించడం లేదంటూ ఎల్బీనగర్‌ కోర్టులో నవీన్‌రెడ్డి పిటిషన్‌ వేశాడు. ఓ వాహన కొనుగోలు చేసి అందులో నామినిగా తన భార్యపేరు వైశాలి అని నవీన్‌రెడ్డి రాయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ డాక్యుమెంట్‌ ఆధారంగా కోర్టులో పిటిషన్‌ వేసినట్లు గుర్తించారు.

ఇంతకీ నవీన్, వైశాలి వ్యవహారంలో ఎవరు నిజం, ఎవరు అబద్దం.! 2021 ఆగస్ట్‌లో పెళ్లి వాస్తవమా.. కాదా? ఒకవేళ పెళ్లి జరిగినా, ఎల్బీనగర్‌లో పిటిషన్‌ వెనుక ఆంతర్యమేంటి? పెళ్లి సాక్ష్యాలు బయటపెట్టొద్దని వైశాలి, నవీన్‌కు చెప్పిందా? ఇంతకీ వైశాలి లవ్‌ నవీన్‌రెడ్డి ఎపిసోడ్‌లో ఏది నిజం?  అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..