Hyderabad: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు.. 63.78 లక్షల జీతంతో ఎంపిక.
ఈ ఏడాది ప్రాంగణ నియామకాల్లో ఐఐటీ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మొన్నటికి మొన్న ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఏకంగా 50 మందికిపైగా రూ. కోటి వార్షిక జీతంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్...
ఈ ఏడాది ప్రాంగణ నియామకాల్లో ఐఐటీ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మొన్నటికి మొన్న ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఏకంగా 50 మందికిపైగా రూ. కోటి వార్షిక జీతంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు కూడా ఉద్యోగ నియామకాల్లో రాణించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన తొలి విడత ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. ఈ విడతలో మొత్తం 700 మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా 144 కంపెనీల్లో 508 మంది ఎంపికయ్యారు.
వీరిలో 54 మంది ఇంటర్నేషనల్ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే గతేడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి 12 ఇంటర్నేషనల్ కంపెనీలు పాల్గొనగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13కి పెరిగింది. ఎంపికైన విద్యార్థుల్లో ఒకరు అత్యధికంగా రూ. 63,78 లక్షల వార్షిక వేతనంతో ఎంపికకావడం విశేషం. ఇక మిగతా విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ రూ. 19,49 లక్షలుగా ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థుల్లో 82% మంది ప్లేస్‌మెంట్ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఈ కోర్సుకు సంబంధించి ఇదే తొలి బ్యాచ్ కావడం విశేషం.
ఇక కంపెనీల విషయానికొస్తే బ్లెండ్ 360 కంపెనీ అత్యధికంగా విద్యార్థులను తీసుకుంది. యాక్సెంచర్ జపాన్, డెన్సో, ఫ్లిప్‌కార్ట్, మోర్గాన్ స్టాన్లీ, ఎన్‌టీటీఏటీ, ఒరాకిల్, స్ప్రింక్లర్, సుజుకి మోటర్స్ కార్పొరేషన్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, టీఎస్‌ఎంసీ, జొమాటో వంటి కంపెనీలు పాల్గొన్నాయి. ఇక రెండో విడుత నియామక ప్రక్రియను వచ్చే జనవరిలో నిర్వహించనున్నట్లు ఐఐటీహెచ్ కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి డాక్టర్ అభినవ్‌కుమార్ వెల్లడించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..