Andhra Pradesh: ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.
ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగానే గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, టీచర్లకు బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు..
ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగానే గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, టీచర్లకు బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు, ఎనిమిదేళ్ల పూర్తి చేసుకున్న టీచర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 12వ తేదీని నుంచి బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్ ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీన బదిలీలకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తారు. మున్సిపల్ టీచర్లకు ఈసారి బదిలీలకు అవకాశం ఇవ్వలేదు.
గురు, శుక్రవారాల్లో సమావేశాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు బదితీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. స్పౌజ్, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు, పాఠశాలల స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
అలాగే ఉపాధ్యాయుల బదిలీల తర్వాత జిల్లా విద్యాధికారుల బదిలీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉండగా, వాటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్త వారిని నియమించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..