Placements: ప్లేస్‌మెంట్స్‌లో దుమ్మురేపిన ఐఐటీ విద్యార్థులు.. 50 మందికి రూ. కోటి జీతంతో ఉద్యోగాలు.
ఓవైపు ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల తొలగింపు అనే వార్తలు భయపెడుతోన్న తరుణంలోనూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ (IIT)లో నియామక ప్రక్రియ మొదలైంది. ఐఐటీల్లో ఉద్యోగాల భర్తీకి కంపెనీలు ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాంపస్‌లో డిసెంబర్ 1వ తేదీ నుంచి క్యాంపస్..
ఓవైపు ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల తొలగింపు అనే వార్తలు భయపెడుతోన్న తరుణంలోనూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ (IIT)లో నియామక ప్రక్రియ మొదలైంది. ఐఐటీల్లో ఉద్యోగాల భర్తీకి కంపెనీలు ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాంపస్‌లో డిసెంబర్ 1వ తేదీ నుంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 650 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో 250 మందికి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్‌లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 50 మంది విద్యార్థులు ఏడాది రూ. కోటి జీతంతో ఎంపికకావడం విశేషం. ఇదిలా ఉంటే వీరిలో దాదాపు 20 మంది విద్యార్థులను హాంకాంగ్, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్, యూకే, అమెరికాకు చెందిన కంపెనీలు నియమించుకున్నారు. అయితే వీరిలో కొందరు విదేశీ ఆఫర్లను కాదని దేశీయ ఆఫర్లను ఎంచుకోవడం విశేషం. ఇక ఈ ఏడాది ఉద్యోగావకాశాలు 20 శాతం పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి.
ఐఐటీ ఢిల్లీలో జరిగిన ప్లేస్‌మెంట్స్‌లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బజాజ్ ఆటో, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఎన్‌ఫేస్ సోలార్ ఎనర్జీ, ఇంటెల్, ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ అండ్ స్ట్రాటజీ వంటి కంపెనీలు ఉన్నాయి. డిసెంబర్‌లో మొదలైన నియామక ప్రక్రియ మే వరకు జరగనుంది. నియామక ప్రక్రియ గురించి ఐఐటీ ఢిల్లీలోని కెరీస్ సర్వీసెస్ ఆఫీస్ హెడ్ డాక్టర్ అనిశ్యా ఓబ్రాయ్ మదన్ మాట్లాడుతూ.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనడానికి ముందుకొచ్చిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నియామకలు పెరగడం సంతోషకరమన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..