Hyderabad: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు.. రూ. 6200 కోట్లతో డేటా సెంటర్.
హైదరాబాద్‌కు పెట్టుబడులు క్యూకడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు భాగ్యనరంలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకోవడం అప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ప్రముఖ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది...
హైదరాబాద్‌కు పెట్టుబడులు క్యూకడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు భాగ్యనరంలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకోవడం అప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ప్రముఖ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది. కాపిటలాండ్ అనే కంపెనీ సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను మంగళవారం ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో…. ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.
రూ. 1,200 కోట్లతో హైదరాబాద్ మాదాపూర్‌లోని CLINT ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల (MW) విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ITPH డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటి. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతోంది. తెలంగాణలో క్యాపిటల్యాండ్ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్‌తో తీరనున్నాయి. అంతేకాకుండా ఇతర IT/ITeS మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంద’ని మంత్రి వివరించారు. ఈ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..