Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆకాశంలో వింత ఆకారం.. హైదరాబాద్‌కు ఏలియన్స్ వచ్చారా? ఎగబడి చూస్తున్న జనాలు..!

Object in Sky: పొద్దు పొద్దున్న ఆకాశంలో వింత ఆకారం హల్‌చల్ చేసింది. అదేంటో తెలియక జనాలు ఎగబడి చూస్తున్నారు. తమ ఫోన్ కమెరాలలో జూమ్ చేసి మరీ ఆ వింత ఆకారాన్ని..

Hyderabad: ఆకాశంలో వింత ఆకారం.. హైదరాబాద్‌కు ఏలియన్స్ వచ్చారా? ఎగబడి చూస్తున్న జనాలు..!
Strange Object In Sky
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2022 | 8:14 AM

Share

పొద్దు పొద్దున్న ఆకాశంలో వింత ఆకారం హల్‌చల్ చేసింది. అదేంటో తెలియక జనాలు ఎగబడి చూస్తున్నారు. తమ ఫోన్ కమెరాలలో జూమ్ చేసి మరీ ఆ వింత ఆకారాన్ని పరిశీలిస్తున్నారు. ఉదయాన్నే ఆకాశంలో ఒక గ్రహం మాదిరిగా ఉన్న ఆకారం దర్శనమిచ్చింది. దానిని గమనించిన పలువురు తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. ఇదేంటా? అని సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌ వాసులు ఈ వింతను ఆకాశంలో గుర్తించారు. తెలుపు రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి జనాలు షాక్ అయ్యారు. అది గ్రహమా? లేక ఏదైనా నక్షత్రమా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఏలియన్ షిప్ ఏమైనా భూమిని సమీపించిందా? అని దానిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే కొందరు మాత్రం ఇది మార్స్ గ్రహం అని అంటున్నారు. ఇలా కొందరు గ్రహం అని, మరికొందరు స్టార్ అని, ఇంకొందరు ఏలియన్ అని రకరకాల ఊహాగాలనాలతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి అదేంటో మీరైనా కనిపెట్టండి చూద్దాం.

ఆ వింత ఏంటో చెప్పేసిన శాస్త్రవేత్తలు..

గ్రహం అని, స్టార్ అని, ఏలియన్స్ అని జరుగుతున్న ప్రచారానికి తెర దించారు శాస్త్రవేత్తలు. అది వెదర్ రీసెర్చ్ బెలూన్‌గా తేల్చారు శాస్త్రవేత్తలు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన హీలియం బెలూన్ అని ప్రశించారు సైంటిస్టులు. వెయ్యి కేజీల బరువు ఉన్న హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..