AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతు వేసిన మాస్టర్ ప్లాన్.. పొలాల్లోకి వచ్చేసిన సన్నీ లియోన్.. చూస్తే అబ్బా అనాల్సిందే..

Telangana: పచ్చటి పొలాల్లో శృంగార తార అందాలు ఆరబోసింది. దారిన వెంట వెళ్ళేవాళ్ళంతా ఆ పొలంలో ఉన్న అందాల సుందరిని చూస్తూ మైమరిచిపోయారు.

Telangana: రైతు వేసిన మాస్టర్ ప్లాన్.. పొలాల్లోకి వచ్చేసిన సన్నీ లియోన్.. చూస్తే అబ్బా అనాల్సిందే..
Sunny Leone Flexi
Ravi Kiran
|

Updated on: Dec 07, 2022 | 7:22 AM

Share

పచ్చటి పొలాల్లో శృంగార తార అందాలు ఆరబోసింది. దారిన వెంట వెళ్ళేవాళ్ళంతా ఆ పొలంలో ఉన్న అందాల సుందరిని చూస్తూ మైమరిచిపోయారు. అయినా పొలంలో శృంగార తార సన్నీ లియోన్ అందాలేంటి.? ఎందుకు.? ఓ రైతు వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌తో అందరూ అక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.

విరగకాసిన మిరప పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు ఓ రైతు దిమ్మ తిరిగే ఆలోచన చేశాడు. సూర్యాపేట మిర్యాలగూడ రహదారి వెంట ఉన్న రెండెకరాల మిర్చి పంటకు దిష్టి తగలకుండా అందాల సుందరి సన్నీలియోన్‌ నిలువెత్తు ప్లెక్సీని ఏర్పాటు చేశారు. సాధారణంగా అయితే చెడు దృష్టిని నివారించేందుకు.. రెండు కర్రలకు పాత బట్టలను వేసి, గడ్డితో నింపి, నల్లటి బొట్లు పెట్టిన కుండతో తయారు చేసిన దిష్టిబొమ్మను లేదా భయంకరంగా కనిపించే రాక్షసుడి ఆకారాన్ని పెడతారు. కానీ రొటీన్‌గా ఎందుకని భావించి సన్నీ లియోన్ ఫోటో పెట్టాడు రైతు. దీంతో విషయం తెలిసిన కుర్రకారు మిర్చి తోటకు క్యూ కడుతున్నారు.

ఈ ఏడాది తన మిర్చి తోటలో మిర్చి ఏపుగా పెరగడంతో రహదారి వెంట వెళ్లేవారు, తన తోట వైపు వచ్చే వారంతా విరగకాసిన మిర్చీని చూస్తున్నారని.. వారి దృష్టిని మళ్ళించేందుకు ఇలాంటి ఫోటో పెట్టానని రైతు చెబుతున్నాడు. వచ్చిన వారి చూపులన్ని తన మిర్చి తోట మీద కాకుండా ఇప్పుడు సన్నీ లియోన్ మీద పడతున్నాయంటున్నాడు రైతు. ఇక తన మిర్చి తోటకి దిష్టి తగలకుండా ఉండటమే కాక ఇటుగా వచ్చిన వారు సన్నీని చూసి ఫన్నీగా నవ్వుకోవడం సరదాగా ఉందని రైతు అంటున్నాడు. ఈ రైతు ఆలోచన వర్కౌట్ అవడంతో.. అదే దారిలో మరింత మంది రైతులు తమ పంటలపై చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించుకునేందుకు తమ తోటలో కూడా సన్నీ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. అయితే కూలీ కోసం వచ్చే మహిళా కూలీలు పచ్చటి పొలాల్లో బూతు బొమ్మలేంటని ఫ్లెక్సీలు పెడుతున్న రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సదరు ఫ్లెక్సీలు తిలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక మహిళలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..