Hyderabad: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్.. రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ నేతల యత్నం..

హైదరాబాద్ రాజ్‌భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ నేతలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం మరింత ఆందోళనకరంగా మారింది.

Hyderabad: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్.. రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ నేతల యత్నం..
Cpi Leaders
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 07, 2022 | 11:34 AM

హైదరాబాద్ రాజ్‌భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ నేతలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్థాయిలో సీపీఐ నేతలు రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు రాజ్‌భవన్‌ దగ్గర భారీగా మోహరించారు. ఆందోళన చేపట్టిన సీపీఐ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ సమీపంలో సీపీఐ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పులిపు మేరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రాజ్‌భవన్‌ ముట్టడికి తరలి వచ్చారు. అప్పటికే అలర్ట్ అయిన పోలీసు బలగాలు.. సీపీఐ నేతలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. కొందరు రాజ్‌భవన్‌ను సమీపించినా.. వారిని అడ్డగించి అరెస్ట్ చేశారు పోలీసులు.

గత కొంతకాలంగా గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గవర్నర్లు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాజకీయ అజెండాలతో ప్రజా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రబ్బర్ స్టాంపు లాంటి గవర్నర్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే