Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి ఉచితంగా శిక్షణ.

తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్‌ 1తో పాటు పోలీసు నియామక పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో గ్రూప్‌4 పోస్టులు విడుదల చేయడం..

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి ఉచితంగా శిక్షణ.
Free Coaching For Group4 Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 07, 2022 | 8:56 AM

తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్‌ 1తో పాటు పోలీసు నియామక పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో గ్రూప్‌4 పోస్టులు విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ విభాగాల్లో 9168 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వగా త్వరలోనే రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ల దాఖలుకు జనవరి 12 చివరి తేదీగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో పరీక్ష ఉండే అవకాశం ఉంది. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే భారీగా ఉద్యోగాల భర్తీ జరగనున్న నేపథ్యంలో గ్రూప్‌ 4 ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతోన్న వారికి మంత్రి హరీష్‌ రావు శుభవార్త తెలిపారు. ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోన్న వారికి ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించారు. ఈ నెల 9లోపు నిరుద్యోగులు అన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. కానిస్టేబుల్, గ్రూప్ 2, టెట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన విధంగానే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని యువతి, యువకులు అవకాశన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 9030433459, 8555032916 ఫోన్ నెంబర్లలలో సంప్రదించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో
భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో
నా ఫస్ట్ క్రష్ అతడే.. వైష్ణవి చైతన్య
నా ఫస్ట్ క్రష్ అతడే.. వైష్ణవి చైతన్య
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..ఎక్కువ తీసుకెళ్తే..నిబంధనలు ఏంటి
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..ఎక్కువ తీసుకెళ్తే..నిబంధనలు ఏంటి
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం...దేశంలో ఎక్కడలేని
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం...దేశంలో ఎక్కడలేని
ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు!
ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు!
ఆ దర్శకుడికి సెకండ్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో సినిమా..
ఆ దర్శకుడికి సెకండ్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో సినిమా..
పీపీఎఫ్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? వార్షిక వడ్డీ రేటు
పీపీఎఫ్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? వార్షిక వడ్డీ రేటు
పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
ఏపీలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..ఎక్కడో తెలుసా?
ఏపీలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..ఎక్కడో తెలుసా?
ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని..
ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని..