Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పుణెలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 551 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పుణెలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 551 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 551 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్ (1), ఏజీఎం- డిజిటల్ బ్యాంకింగ్ (1), ఏజీఎం- నిర్వహణ సమాచార వ్యవస్థ (1), చీఫ్ మేనేజర్- ఎంఐఎస్ (1), చీఫ్ మేనేజర్- మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ (1), చీఫ్ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ (02), చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ (1), చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (1), చీఫ్ మేనేజర్- క్రెడిట్ (15), చీఫ్ మేనేజర్- డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (1), చీఫ్ మేనేజర్- పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ (1), జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-2 (400), జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-3 (100), ఫారెక్స్/ ట్రెజరీ ఆఫీసర్ (25) ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ, ఎస్టీ, విద్యాంగ అభ్యర్థులు రూ. 118, మిగతా వారు రూ. 1180 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 23-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..