Drone Pilots: డ్రోన్ రంగంతో ఉపాధికి భరోసా.. వచ్చే ఏడాదిలో కొత్తగా లక్ష ఉద్యోగాలు..
యువతకు సరైన నైపుణ్యాలు, శిక్షణ అందిస్తే భారత్ ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నేడు సాంకేతికత ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేస్తోందని, సంక్లిష్ట సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నామని చెప్పారు...
యువతకు సరైన నైపుణ్యాలు, శిక్షణ అందిస్తే భారత్ ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నేడు సాంకేతికత ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేస్తోందని, సంక్లిష్ట సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. డ్రోన్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డ్రోన్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. 2023 నాటికి భారతదేశానికి కనీసం 1 లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరమవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రోన్ పైలట్ నెలకు కనీసం 50-80 వేలు సంపాదిస్తున్నాడని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో పలు రంగాల్లో డ్రోన్‌ల వినియోగం అనివార్యం కానుంది. పొలాల్లో పురుగుమందులు, నానో ఎరువులను పిచికారీ చేసేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడం అనేది సుపరిపాలన, జీవన సౌలభ్యం పట్ల మన నిబద్ధతను మరింతగా పెంచడానికి మరొక మార్గమని అభిప్రాయపడ్డారు. డ్రోన్ సామాన్య ప్రజల జీవితాల్లో భాగం కాబోతోందని తెలిపిన అనురాగ్.. రక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పర్యాటకం, చలనచిత్రం, వినోద రంగాలలో డ్రోన్ సాంకేతికత అవసరపడుతోందని చెప్పుకొచ్చారు.
India is emerging as a leading player in the drone tech space!
Launched the 1st Drone Skilling & Training Conference and flagged off the Drone Yatra at Garuda Aerospace, Agni College of Technology, Chennai. Also tried my hand at flying one! pic.twitter.com/rIhe95Bh7A
— Anurag Thakur (@ianuragthakur) December 6, 2022
ఇక భారత్‌ను డ్రోన్ హబ్‌గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. బలమైన డ్రోన్ తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పిఎల్‌ఐ) వంటి పథకాలు ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. డ్రోన్ రంగానికి బలోపేతం చేయడానికి కేంద్రం కొత్తగా మూడు విధానాలు తీసుకొచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వ శాఖలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..