Indian Railways: మరో 25 ఏళ్లలో 1,00,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌లు.. ఇక భారత రైల్వే స్పీడ్ మామూలుగా ఉండదు..

Indian Railways: భారతీయ రైల్వే వేగంగా ప్రగతి సాధిస్తోంది. పాతకాలం నాటి పద్ధతుల నుంచి బయటకొస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అందుకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

Indian Railways: మరో 25 ఏళ్లలో 1,00,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌లు.. ఇక భారత రైల్వే స్పీడ్ మామూలుగా ఉండదు..
Indian RailwayImage Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 10, 2022 | 2:38 PM

Indian Railways: భారతీయ రైల్వే వేగంగా ప్రగతి సాధిస్తోంది. పాతకాలం నాటి పద్ధతుల నుంచి బయటకొస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అందుకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇటీవలే ప్రారంభించిన కొత్త తరహా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అద్భుత స్పందన రావడంతో ఆ సర్వీసులను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకనుగుణంగా దేశ వ్యాప్తంగా కొత్త రైల్వే ట్రాక్‌‌ల ఏర్పాటుతో పాటు ఇది వరకే ఉన్న రైల్వే ట్రాక్లను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరో 25 ఏళ్లలో 1,00,000 కిలో మీటర్ల రైల్వే ట్రాక్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను వచ్చే ఆర్థిక బడ్జెట్ (2023-24)లో కేంద్రం ఖరారు చేయనున్నట్లు మింట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

మొత్తం ఖర్చు రూ.15నుంచి 20 ట్రిలియన్లు..

25 ఏళ్లలో 1,00,000 కిలో మీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించనుండగా.. ప్రస్తుతం ఉన్న ముడి సరుకుల ధరలకనుగుణంగా దీనికి దాదాపు రూ. 15 నుంచి 20 ట్రిలియన్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. అంచనవారీగా ఈ ప్రణాళికలను అమలు చేయనున్నారు. ఆ మేరకు ప్రతి ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా  ఆధునిక సాంకేతికతతో ట్రాక్ లకు మెరుగులు దిద్ది.. రైళ్ల వేగాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు ‌దోహదపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

రూ. 10,000 కోట్లతో ఎలక్ట్రిఫికేషన్ పనులు..

బ్రాడ్ గేజ్ లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేసేందుకు రూ. 10,000 కోట్లు వచ్చే బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు 7000 కిలోమీటర్ల మేర ట్రాక్లు కొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది.  అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం దేశంలో 4000 కిలోమీటర్ల అత్యాధునిక  కొత్త ట్రాక్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి గానూ రూ. 50,000 కోట్లు  బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కొత్త ట్రాక్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులతో పోలిస్తే ఇది రెండింతలు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

400 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు..

రైల్వే శాఖ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో రానున్న కాలంలో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దాదాపు 300 నుంచి 400 వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి ప్రస్తుత వేగం గంటకు 180 కిలోమీటర్లు. అలాగే సాధారణ రైళ్ల వేగం కూడా 160 కి తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. అందుకనుగుణంగా దేశ వ్యాప్తంగా ట్రాక్లను ఆధునికీకరిస్తున్నారు.

లాభాల బాటలో రైల్వే..

భారతీయ రైల్వే లాభాల ట్రాక్ పై రయ్యి రయ్య మంటూ దూసుకుపోతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరం రెవెన్యూలో 11 శాతం గ్రోత్ రేట్ కనిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ రూ. 13,560 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే నవంబర్లో రూ. 12,206 కోట్లు రాబట్టింది. అలాగే రైల్వే కార్గో లో కూడా 8.5 నుంచి 10 శాతం వరకూ రెవెన్యూ గ్రోత్ అంచనా వేయగా.. 12 నుంచి 14 శాతం గ్రోత్ కనిపించింది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి