Home Loan: హోమ్ లోన్స్‌పై అంతకంతకూ పెరుగుతున్న వడ్డీ రేటు.. వచ్చే బడ్జెట్‌లో కేంద్రం ఊరటనిస్తుందా..?

Budget 2023-24: కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని శాసించింది. రెండు సంవత్సరాల పాటు అన్ని వ్యవస్థలను స్తంభింపజేసింది. అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకొన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Home Loan: హోమ్ లోన్స్‌పై అంతకంతకూ పెరుగుతున్న వడ్డీ రేటు.. వచ్చే బడ్జెట్‌లో కేంద్రం ఊరటనిస్తుందా..?
Home Loan
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 10, 2022 | 11:24 AM

కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని శాసించింది. రెండు సంవత్సరాల పాటు అన్ని వ్యవస్థలను స్తంభింపజేసింది. అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకొన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీనికి తోడు ద్రవ్యోల్భణం కట్టడి ప్రయత్నాల్లో భాగంగా కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ గత రెండేళ్లుగా పెంచుతూనే ఉంది. దీంతో బ్యాంకులు ఇచ్చి రుణాలపై వడ్డీ రేట్ల క్రమంగా పెరుగుతున్నాయి.  మరీ ముఖ్యంగా హోమ్ లోన్‌లపై వడ్డీరేట్లు కోవిడ్ మునుపటితో పోల్చితే ఏకంగా రెండు శాతం మేర పెరిగాయి. దీంతో వేతనజీవులపై ఈఎంఐ భారం బాగా పెరిగింది.

అటు హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో  ఇళ్ల కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అమ్ముడు పోని ప్లాట్ల సంఖ్య మహా నగరాల్లో భారీగా పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వడ్డీ రేట్ల కారణంగా ఇళ్లకు తగ్గిన డిమాండ్ మళ్లీ పెరగాలంటే.. సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరే వారికి మరింత ప్రయోజనాలను చేకూర్చే విధంగా 2023లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కొన్ని రాయితీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు.

సెక్షన్ 80సీ రూల్స్ ని సవరిస్తే మేలు

ముఖ్యంగా సెక్షన్ 80 సీ నిబంధనలు సవరించాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులు మళ్లీ దీనిని గుర్తు చేస్తున్నారు. సెక్షన్ 80సీ ప్రకారం ప్రస్తుతం రూ. 1.5లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పరిమితి ఉంది. అయితే సగటు ఎంప్లాయీకి దీనికి ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, లైఫ్ ఇన్స్యూరెన్స్ వంటి వాటి వలన ఈ 80 సీ లిమిట్ దాటిపోతోంది. తద్వారా హోమ్ లోన్ అసలు(ప్రిన్సిపల్ అమౌంట్)పై పన్ను మినహాయింపు రాయితీని ఉద్యోగులు వినియోగించుకోవడం కష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

అలాగే గృహ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీలకు సంబంధించి ప్రత్యేక సెక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్షన్ 80సీ అనేది చాలా పాతది అయిపోందని.. ఏళ్లుగా దానిని అలాగే ఉంచేయడం వల్ల సొంతిళ్లు కొనుగోలు చేసిన వారికి ఉపశమనం లభించడం లేదని చెబుతున్నారు.  అయితే ఒకటికి మించి ఇళ్లు  కొనుగోలు చేసే వారికి అదనపు బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసే వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని ప్రొవిజన్స్ తీసుకొస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.

సెక్షన్ 24 బీను కూడా..

ఇక తీసుకున్న లోన్ పై అసలుకు సంబంధించి మాత్రమే కాకుండా వినియోగదారుడు కట్టే వడ్డీపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం సెక్షన్ 24బీ ని అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సెక్షన్ ప్రకారం సంవత్సరంలో రెండు లక్షల రూపాయల వరకు వడ్డీకి పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. అయితే దీనిని రూ. 3 – 4లక్షల వరకు పెంచితే బాగుంటుందని నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు. దీని ద్వారా హౌసింగ్ రంగంలో డిమాండ్ అలాగే కొనసాగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదే విధంగా సెక్షన్ 80ఈఈ, 80ఈఈఏలను కూడా సవరించాలని ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ కోరుతున్నారు. వీటి ద్వారా ఇళ్లు కొనాలనుకునే వారికి ప్రయోజనం చేకూరుతుందని వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి