Gold Loan: అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్ కావాలా? మీకిదే బెస్ట్ ఆప్షన్.. వివరాలు చెక్ చేసుకోండి
Gold Loan - Cheapest Banks: బ్యాంకుల నుంచి మీ అవసరాలకు రుణం తీసుకుంటున్నారా? అయితే రుణంపై వడ్డీ రేటు ఏ బ్యాంకులో ఎక్కువ ఉంది? ఏ బ్యాంకులో తక్కువ ఉంది? ప్రాసెసింగ్ ఫీజు ఎంత? లేట్ పేమెంట్ చార్జీలు వంటి విషయాలపై లోన్ తీసుకునే ముందే కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం.
Gold Bank: మీ వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే రుణంపై వడ్డీ రేటు ఏ బ్యాంకులో ఎక్కువ ఉంది? ఏ బ్యాంకులో తక్కువ ఉంది? ప్రాసెసింగ్ ఫీజు ఎంత? లేట్ పేమెంట్ చార్జీలు వంటి విషయాలపై లోన్ తీసుకునే ముందే కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం. వీటికంటే మించి పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ కంటే గోల్డ్ లోన్‌పై తక్కువ వడ్డీకే తక్షణ రుణాలు లభిస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. వ్యక్తిగత అవసరాలకు అధిక వడ్డీలకు అప్పు తీసుకోవడం రిస్క్ అని భావిస్తున్నప్పుడు గోల్డ్ లోన్ బెస్ట్ ఆప్షన్.. దీని ద్వారా పెద్ద మొత్తంలో అధిక వడ్డీలకు తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ వడ్డీతో పాటు అత్యంత సురక్షిత రుణ సదుపాయం గోల్డ్ లోన్ మాత్రమే. అత్యవసర సమయాల్లో సులభంగా రుణాలు పొందేందుకు గోల్డ్ లోన్ అత్యుత్తమ మార్గం.
బ్యాంకుల్లో ఇతర ఏ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ చాలా అవసరం. కానీ గోల్డ్ లోన్‌కి సిబిల్ తక్కువ ఉన్నా.. తనఖా బంగారం ఉంటుంది కాబట్టి బ్యాంకర్లు రుణమిచ్చేందుకు వెనుకాడవు. మీరు కేవలం ఆధార్ కార్డుతో పాటు తనఖా పెట్టాల్సిన బంగారం తీసుకువెళ్తే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరవుతుంది. అయితే గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు ఏ బ్యాంకులో ఎక్కువ ఉంది ? ఏ బ్యాంకులో తక్కువ ఉంది? ప్రాసెసింగ్ ఫీజు ఎంత? లేట్ పేమెంట్ చార్జీలు వంటి విషయాలపై లోన్ తీసుకునే ముందే కనీస అవగాహన కలిగి ఉండటం ఉత్తమం. ఈ వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంటుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకలా.. ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో మరోలా ఉంటుంది. బ్యాంకు బ్యాంకుకు వడ్డీ రేటులో మార్పు కనిపిస్తుంది.
మరి తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలిచ్చే ఐదు బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాధారణంగా గోల్డ్ లోన్‌పై బ్యాంకులు ఏడు శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తాయి. వీటిలో తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకు ఫెడరల్ బ్యాంకు. ఇది ఏడు శాతం వడ్డీతో గోల్డ్ లోన్ మంజూరు చేస్తుంది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజుగా లోన్ తీసుకున్న మొత్తంపై 0.56 శాతం తీసుకుంటుంది.
2. ఆ తర్వాత ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 7.10 నుంచి 7.20 శాతం వరకు వడ్డీతో గోల్డ్ లోన్స్ మంజూరు చేస్తుంది. అలాగే లోన్ తీసుకున్న మొత్తం నుంచి 0.75 శాతం ప్రాసెసింగ్ ఫీజు గా తీసుకుంటుంది.
3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు 7.25 నుంచి 7.50 శాతం వడ్డీతో లోన్ మంజూరు చేస్తోంది.
4. యూకో బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే 7.40 నుంచి 7.90 వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 వరకు ఉంది. మీరు లోన్ తీసుకున్న మొత్తంపై ఈ ప్రాసెసింగ్ ఫీజు ఆధారపడి ఉంటుంది.
5.ప్రైవేటు సెక్టార్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అయితే 7.60 నుంచి 16.81 శాతం వరకు వడ్డీతో గోల్డ్ లోన్ అందిస్తోంది. అలాగే లోన్ తీసుకున్న మొత్తం నుంచి ఒక శాతం నగదు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
గోల్డ్ లోన్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయా బ్యాంకుల శాఖలను నేరుగా సంప్రదించి తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..