Bank Loan: మీరు తక్కువ వడ్డీ రేట్లలో రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి

చాలా మంది గృహ రుణం, పర్సనల్‌ లోన్‌, ఇతర రుణాలు తీసుకోవడం అనేది సర్వసాధారణం. అయితే తీసుకున్న రుణాలలో తక్కవ వడ్డీ ఉండాలంటే మీకు సిబిల్‌ తప్పనిసరి..

Bank Loan: మీరు తక్కువ వడ్డీ రేట్లలో రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి
Bank Loan
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2022 | 1:09 PM

చాలా మంది గృహ రుణం, పర్సనల్‌ లోన్‌, ఇతర రుణాలు తీసుకోవడం అనేది సర్వసాధారణం. అయితే తీసుకున్న రుణాలలో తక్కవ వడ్డీ ఉండాలంటే మీకు సిబిల్‌ తప్పనిసరి అవసరం. ఏ రకమైన లోన్‌ తీసుకోవాలంటే మీ సిబిల్‌ స్కోర్‌ మెరుగ్గా ఉండటం తప్పనిసరి. మంచి స్కోర్‌ ఉన్నట్లయితే మీకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. మీకు ఎక్కువగా సిబిల్‌ ఉన్నట్లయితే రుణం ఇచ్చే బ్యాంకు, ఆర్థిక సంస్థ రుణ చెల్లింపు విషయంలో మిమ్మల్ని విశ్వసిస్తుంది. సాధారణంగా 700 కంటే ఎక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉంటే ఎంతో మంచిది. అయితే మీ సిబిల్‌ మరింతగా మెరుగు పర్చుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

మీరు ఇప్పటికే రుణం తీసుకున్నట్లయితే ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. మంచి సిబిల్‌ స్కోర్‌ను నిర్వహించడానికి సరైన సమయానికి ఈఎంఐలను చెల్లించడం ఉత్తమ మార్గం. మీరు దీన్ని చేయకపోతే మీ సిబిల్‌ స్కోర్‌ తీవ్రంగా పడిపోతుంటుంది. భవిష్యత్తులో లోన్ పొందడం కష్టం అవుతుంది. అందుకే రుణం తీసుకోవడానికి మీ సిబిల్‌ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుకోండి.

పాత రుణాలను తీర్చుకోండి:

మీరు కొత్త రుణం తీసుకోవాల్సి వస్తే అంతకు ముందు ఉన్న పాత రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను కూడా తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణ చెల్లింపు కోసం ఖర్చు చేస్తున్నట్లయితే ఆర్థిక సంస్థలు మీకు సులభంగా కొత్త రుణం ఇవ్వడానికి ఇష్టపడవు. కానీ మీరు మీ పాత రుణాలన్నింటినీ సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉంటుంది. కొత్త రుణాలు తీసుకోవడం సులభం అవుతుంది. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే దానిలో ఇచ్చిన మొత్తం క్రెడిట్ పరిమితిని ఉపయోగించవద్దు. కొంత మొత్తాన్ని ఉంచుతూ వాడుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

దీర్ఘకాలిక రీపేమెంట్ ఆప్షన్‌:

మీరు లోన్ రీపేమెంట్ కోసం సుదీర్ఘ కాల వ్యవధి ఎంపికను ఎంచుకుంటే, ఈఎంఐ తగ్గుతుంది. మీరు దానిని క్రమం తప్పకుండా చెల్లించడం సులభం అవుతుంది. ఇది కాకుండా మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల, లోన్ మొత్తంతో పోలిస్తే మీ ఆదాయం చాలా ఎక్కువగా లేకుంటే మీరు దీర్ఘకాలిక లోన్ రీపేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్‌ రేటింగ్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం కూడా మీ క్రెడిట్ రేటింగ్‌కు మంచిది కాదని గుర్తించుకోండి. మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగేంత రుణం తీసుకోండి. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా అని ఇష్టానుసారంగా తీసుకుంటే చెల్లింపులు చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. మీరు చాలా ఎక్కువ రుణాలు తీసుకుంటే వాయిదాలను సకాలంలో చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇది మీ సిబిల్‌ స్కోర్‌పై చెడు ప్రభావం చూపుతుంది.

మీ సామర్థ్యానికి మించి రుణం తీసుకోవడం మీ సిబిల్‌ రేటింగ్‌కు మంచిది కాదు. కానీ మీరు ఇంతకు ముందెన్నడూ రుణం తీసుకోకపోతే మీకు క్రెడిట్ చరిత్ర ఉండదు. అటువంటి పరిస్థితిలో మీ రేటింగ్‌ను నిర్ణయించడానికి సిబిల్‌ సరైన ఆధారం ఉండదు. అందుకే సిబిల్‌ రేటింగ్ కోసం కొంత క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండటం మంచిది. అంటే మీరు రాబోయే రోజుల్లో గృహ రుణం లేదా కారు లోన్ వంటి పెద్ద రుణాన్ని తీసుకోవాల్సి వస్తే, దాని కంటే ముందు కొన్ని చిన్న రుణాలు తీసుకోవడం ద్వారా మీ క్రెడిట్ చరిత్రను రూపొందించడం జరుగుతుంది. దీని వల్ల మీ సిబిల్‌ స్కోర్‌ను మెరుగుపరచడానికి మంచి మార్గం. ఉదాహరణకు మీరు ఒక వస్తువును క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసి, వడ్డీ లేని లోన్ తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్ మెరుగుపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద రుణం తీసుకునేటప్పుడు మీరు దీని ప్రయోజనాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి