AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Saving Tips: ఇల్లు కట్టే ప్లాన్ చేస్తున్నారా? ఇలా చేస్తే లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు..

Money Saving Tips: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. తమకంటూ ఒక ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఆ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతారు. రూపాయి రూపాయి కూడబెడుతూ.. ఇంటి నిర్మాణానికి అవసరమైన..

Money Saving Tips: ఇల్లు కట్టే ప్లాన్ చేస్తున్నారా? ఇలా చేస్తే లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు..
House Plan
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2022 | 6:00 PM

Share

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. తమకంటూ ఒక ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఆ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతారు. రూపాయి రూపాయి కూడబెడుతూ.. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బును సంపాదిస్తారు. అయితే, ఇల్లు కట్టడం అంత తేలికపైన పని కాదు. ఇంటి నిర్మాణం ప్రణాళికాబద్దంగా చేయకపోతే.. చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇంటి ప్లాన్ వేయడం నుంచి నిర్మాణం, ఇతర పనులన్నీ సరిగా నిర్వహించాలి. కొంచెం తేడా వచ్చినా, సమయం, డబ్బు వృద్ధా అవుతుంది. ఇంకా వాస్తు వంటి అంశాల్లో తప్పులు చేస్తే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇల్లు నిర్మాణం అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని పాటించడం ద్వారా ఇంటి నిర్మాణంలో ఎలాంటి సమస్యలు రావు. పైగా లక్షలాది రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మీరు ఇల్లు నిర్మిస్తున్నట్లయితే.. ముందుగా ఇంటి మ్యాప్‌ను రెడీ చేసుకోవాలి. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడానికి 20-30 రోజుల ముందే ఇంటి మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలి.

2. అంతకంటే ముందు.. వాస్తు శిల్పితో చర్చించి, వాస్తు అంశాల ఆధారంగా ఆ మ్యాప్ రెడీ చేసుకోవాలి. తద్వారా ఇంటిని నిర్మించేటప్పుడు ఏర్పడే సమస్యలు తగ్గుతాయి. అనవసర తలనొప్పులు రాకుండా ఉంటుంది. మ్యాప్ ముందే సిద్ధం చేసుకోవడం వలన స్థలం ఖర్చు ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి

3. ఇల్లు నిర్మాణం కోసం చదునుగా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. ఎగుడుదిగుడుగా ఉంటే.. దానిని సెట్ చేయడానికి బోలెడ్ ఖర్చు చేయాల్సి వస్తుంది.

4. ఇల్లు నిర్మాణానికి సంబంధించి ముందే బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు కట్టేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ముందే ఒక అంచనాకు వస్తారు. అలా ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయడానికి ఆస్కారం లభిస్తుంది. తద్వారా డబ్బు వృధా ఖర్చు అవ్వదు.

5. ఇంటి నిర్మాణం కోసం అనుభవజ్ఞులైన తాపీపని వారిని ఎంచుకోవాలి. మంచి పనివారు దొరికితే.. ఇంటి నిర్మాణం సాఫీగా సాగుతుంది. లేదంటే.. అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి. మంచి పని వారు దొరికితే డబ్బు కూడా ఆదా అవుతుంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..