AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: మీరు ఐటీఆర్‌ రిటర్న్‌ పూర్తి చేయలేదా..? నో టెన్షన్‌.. అలాంటి వారికి కేంద్రం కీలక నిర్ణయం

మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే ఈ సమాచారం మీ కోసమే. రెగ్యులర్‌గా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వారు ఇప్పటి వరకు రిటర్న్ ఫైల్ చేయకుంటే ఇప్పుడు ఆదాయపు..

ITR Filing: మీరు ఐటీఆర్‌ రిటర్న్‌ పూర్తి చేయలేదా..? నో టెన్షన్‌.. అలాంటి వారికి కేంద్రం కీలక నిర్ణయం
Itr Filing
Subhash Goud
|

Updated on: Dec 10, 2022 | 9:46 AM

Share

మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే ఈ సమాచారం మీ కోసమే. రెగ్యులర్‌గా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వారు ఇప్పటి వరకు రిటర్న్ ఫైల్ చేయకుంటే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారికి సమాచారం అందజేస్తోంది. ఇది కాకుండా ఐటీఆర్‌ ఫైలింగ్ స్థితిని కూడా మీకు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పన్ను చెల్లింపుదారు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ మోడ్ ద్వారా తన రిటర్న్‌ను ఫైల్ చేయడం ప్రారంభించి, ఆపై కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలో వదిలివేస్తే అతనికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి సమాచారం అందుతుంది.

సదరు వ్యక్తికి మెసేజ్‌..

అయితే అధికారులు సదరు వ్యక్తికి పంపిన సమాచారంలో 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి మీ ఐటీఆర్‌ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందని మేము గమనించాము. దయచేసి ఐటీఆర్‌ని పూర్తి చేసి, సమర్పించి, ఇ-ధృవీకరించండి అని పంపిన సందేశంలో ఉంటుంది. ఏ వ్యక్తి అయినా అనేక కారణాల వల్ల తన ఐటీఆర్‌ ఫైల్‌ను మధ్యలోనే వదిలివేయవచ్చు. ఒక వ్యక్తి తన ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడం మర్చిపోవడం లేదా పూర్తి సమాచారం లేకపోవడం వల్ల ఫైల్ ప్రక్రియను మధ్యలో అసంపూర్తిగా వదిలేయడం వంటిది జరుగుతుంటాయి. ఇది కాకుండా, చివరి తేదీకి ముందు ప్రజలు తమ రిటర్న్‌లను దాఖలు చేయడంలో అజాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తికి ఐటీఆర్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. సీనియర్ సిటిజన్లకు మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఇది రూ. 5 లక్షలు.

ఇప్పుడు వాపసు పొందడంలో జాప్యం ఉండదు

ఇది కాకుండా ఇప్పుడు మీ పన్ను వాపసు పొందడంలో ఆలస్యం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఎందుకంటే బకాయి పన్ను ప్రకారం వాపసు సర్దుబాటుపై పన్ను అధికారులు నిర్ణయం తీసుకునే సమయాన్ని ఆదాయపు పన్ను శాఖ 30 రోజుల నుంచి 21 రోజులకు తగ్గించింది. ఆదాయపు పన్ను డైరెక్టరేట్ నోటీసు ప్రకారం వ్యక్తి సర్దుబాటుకు అంగీకరించకపోతే లేదా పాక్షిక ఒప్పందాన్ని కలిగి ఉంటే ఆ విషయం తక్షణమే మదింపు అధికారికి పంపబడుతుంది. అప్పుడు, రిఫరెన్స్ తేదీ నుండి 21 రోజులలోపు సర్దుబాటు చేయాలా వద్దా అనే దానిపై అధికారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఆదాయపు పన్నుకు సంబంధించిన కేసులను తగ్గించేందుకు ఇలా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..