PM Kisan: ఆదాయపు పన్ను చెల్లిస్తూ పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందుతున్నారా..? జాగ్రత్త!

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అదే సమయంలో రైతులకు..

PM Kisan: ఆదాయపు పన్ను చెల్లిస్తూ పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందుతున్నారా..? జాగ్రత్త!
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2022 | 1:49 PM

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అదే సమయంలో రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలో ఎంతో మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఇప్పుడు కొంత మంది రైతులకు సమస్య ఉండవచ్చు.

దేశంలో చాలా మంది ప్రజలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ప్రజల ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే దానిపై పన్ను దాఖలు చేయాలి. పన్ను దాఖలు కోసం ఆదాయపు పన్ను శాఖ వేర్వేరు పన్ను స్లాబ్‌లను కూడా సెట్ చేసింది. మరోవైపు, రైతులు పన్ను దాఖలు చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కూడా సద్వినియోగం చేసుకుంటే అటువంటి రైతులకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు మూడు వాయిదాలలో మొత్తం రూ.6000ను అందిస్తోంది. ఈ మొత్తం వాయిదాకు రూ.2000 చొప్పున మోడీ సర్కార్‌ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంటుంది. ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు మాత్రమే అందజేస్తారు.

అయితే ఈ పథకం ప్రయోజనం పొందుతున్న రైలులు ఆదాయపు పన్ను చెల్లిస్తే వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని తీసుకునే అర్హత ఉండదనే నిబంధన ఉంది. అటువంటి పరిస్థితిలో వారి ఖాతాలో పీఎం కిసాన్ మొత్తం వస్తే తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించే వారు అనర్హులు. ఒక వేళ మీరు అనర్హులుగా ఉండి పీఎం కిసాన్ ప్రయోజనం పొంది డబ్బులు వాపసు చేయకుంటే మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీపై కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారు ముందస్తుగానే డబ్బులు వెనక్కి ఇచ్చేయడం మేలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి