AP Rains: తీవ్ర వాయుగుండంగా మారిన మాండాస్ తుఫాన్.. ఏపీలో వచ్చే 3 రోజులు వానలు దంచుడే
ఏపీలో మాండూస్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల్లో నిన్నటినుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
తీవ్ర వాయుగుండంగా మారిన మాండాస్ తుఫాను గత 6 గంటలలో 09 కి.మీ వేగంతో పశ్చిమ నైరుతి దిశగా కదిలి శనివారం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఉత్తర తమిళనాడు దిశంగా పయనించింది. వెల్లూరుకు పశ్చిమ నైరుతి దిశలో 40 కి.మీ, కృష్ణగిరి కి తూర్పు ఈశాన్య దిశలో 140 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది. వచ్చే 6 గంటలలో ఇది దాదాపు పశ్చిమ నైరుతి దిశగా కదిలి క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు
ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు :-తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కీ మీ వేగం తో వీచే అవకాశము ఉంటుంది.
రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :-
ఈ రోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కీ మీ వేగం తో వీచే అవకాశము ఉంటుంది .
రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
తిరుపతిలో మాండాస్ తుఫాన్ ఎఫెక్ట్ :
తిరుపతిలో మాండాస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. బాలయ్యపల్లి వద్ద నేరేడువాగుకు వరద ఉదృతి పెరిగింది.వాగుపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో గూడూరు వెంకటగిరి మద్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో రోడ్డును మూసివేశారు అధికారులు. ప్రమాదకరంగా మారిన వాగుపైకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గూడూరు మండలం తిప్పవారిపాడు వద్ద ఉదృతంగా ప్రవహిస్తోంది కైవల్యనది. దీంతో రాపూరు, సైదాపురం, గూడూరు మద్య రాకపోకలకు అంతరాయం. ఉప్పుటేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో తిప్పగుంటపాలెంకు రాకపోకలు బందయ్యాయి. వాకాడు మండలంలో పంబలి, శ్రీనివాసపురం మధ్య ఉప్పుటేరువాగు ఉధృతితో..లోతట్టు ప్రాంతాలకు వరద నీరు భారీగా చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు.ఇక చెన్నూరు వద్ద కట్టాలమ్మ గుడిని చుట్టుముట్టింది వరద నీరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..