Kakinada: ప్రమాదం ఇలా ముంచుకొస్తుందని ఎవరైనా కనీసం ఊహిస్తారా.. బైక్‌పై వెళ్తుంటే..
ప్రమాదం ఇలా ముంచుకొస్తుందని ఎవరైనా ఊహిస్తారా..? ఇలా ఊపిరి పోవొచ్చని ఎవరైనా కలగంటారా..? ఏం చేస్తాం ఆ కూలీని విధి అంత చిన్నచూపు చూసింది.

ఆయువు ఎప్పుడు ఎలా పోతుందో చెప్పలేం. మృత్యువు ఏ రూపంలో వస్తుందో అస్సలు ఊహించలేం. కాలం ఆడే ఆటలో… మనుషులు పావులు అంతే. తాజాగా ఓ వ్యవసాయ కూలీని విధి చిన్న చూపు చూసింది. పని ముగించుకుని వెళ్తున్న అతడిని.. తాడిచెట్టు రూపంలో బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది.
జిల్లాలోని కరప మండలం గొర్రిపూడిలో ఆరువిల్లి సుబ్బరాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు వ్యయసాయ కూలీగా పనిచేస్తూ.. వస్తున్న కొద్దిపాటి డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తాజాగా పొలం పనికి వెళ్లి బైక్‌పై ఇంటికి తిరిగి పయనమయ్యాడు. మంత్రాల తూము సమీపంలో అతనిపై తాటిచెట్టు విరిగి పడింది. అతని తల చెట్టు కాండం కింద నలిగిపోయి.. నుజ్జునుజ్జయ్యింది. సుబ్బరాజు స్పాట్‌లోనే ఊపిరి విడిచాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకుంది. తుపాను నేపథ్యంలో భారీ గాలుల కారణంగా ఆ తాడిచెట్టు విరిగి పడినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న కరప పోలీసులు మృతుడి వివరాలు సేకరించారు. తదుపరి విచారణ జరుగుతుంది. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చూడండి.. ఇంకొద్ది సేపు ఆగితే.. అతడు ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని చూసేవాడు. ఈ మాదిరిగా ప్రమాదం మీదకొస్తుందని ఎవరైనా ఊహిస్తారా. అందుకే అంటారు పెద్దలు.. టైం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందని. జీవితం చాలా చిన్నది.. ఉన్నంతకాలం హ్యాపీగా బ్రతికేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..