AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే..?

అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్. ఇదే BRS నినాదం. తొలిరోజే టార్గెట్ ఫిక్స్ చేశారు KCR. ఎర్రకోటపై గులాబీజెండా ఎగరాలి. BRS వెలుగులు దేశమంతటా విస్తరించాలి..! ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయం.. వేసే ప్రతి అడుగూ ఈ లక్ష్యంతోనే.! ఈ క్రమంలోనే వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

BRS: ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే..?
CM KCR's Bharat Rashtra Samithi
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2022 | 4:00 PM

Share

తెలంగాణ ఆత్మసాక్షిగా, అచ్చమైన ప్రాంతీయ స్పూర్తితో మొదలైన కేసీఆర్ రాజకీయ ఉద్యమం… ఇక ఫక్తు జాతీయ భావజాలంతో సాగబోతోంది. భారత రాష్ట్రీయ సమితి జెండాను ఆవిష్కరించి… అంతే జోష్‌తో ఛలో ఢిల్లీ అనేశారు గులాబీ దళపతి. ఇక్కడ విజయవంతమైన ఫార్ములాతోనే అక్కడా సక్సెస్ కొడతారట. రైతే మాకు రారాజు… అబ్‌కీ బార్‌- కిసాన్‌ సర్కార్… ఇదీ నినాదం. బీఆర్‌ఎస్ కోసం కేసీఆర్ గీసుకున్న కొత్త స్కెచ్‌లోని సిక్స్‌ పాయింట్‌ ఫార్ములాలో ఇదే కీలకం. ఆ తర్వాత ప్లేస్ మహిళా సాధికారత కోసం. దేశ స్థితిగతుల్ని మార్చడానికి… ఇప్పటికే ఎకనమిస్టుల్ని దగ్గర పెట్టుకుని… ఆర్థిక పాలసీల్ని గట్టిగా రాసుకున్నామన్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం, రైతుబంధు, దళితబంధు అమలు చేయడం… లాంటివన్నీ కేసీఆర్‌ని మాస్ లీడర్‌గా ఎలివేట్ చేస్తాయని BRS క్యాడర్ నమ్ముతోంది.

BRS తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు

BRS వెలుగులు దేశమంతటా విస్తరింపజేస్తామని చెప్పారు కేసీఆర్. BRS తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు. 2023 మే లోపే ఎలక్షన్స్‌ జరుగుతాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో JDS తో కలిసి పోటీ చేయనుంది BRS. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ చేస్తోంది. దీంతో కేసీఆర్‌ నేషనల్ ఎలక్టోరల్ ఫైట్ షురూ అవుతుంది. ఢిల్లీలో ఈనెల 14న BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి… హస్తిన నుంచి జాతీయ రాజకీయ సందేశం ఇవ్వబోతున్నారు గులాబీ దళపతి. పోదామా ఢిల్లీకి… అంటూ తెలంగాణా జనం నుంచి కోరస్ రాబట్టుకున్నారు కేసీఆర్. త్వరలోనే జాతీయ విధానాన్ని ప్రకటించనున్నారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో త్వరలోనే బీఆర్‌ఎస్ కార్యాలయం

ఏపీలోనూ బీఆర్‌ఎస్ కార్యాలయ ఏర్పాటకు సన్నాహాలు మొదలెట్టేశారు. విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టనున్నారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే సమీపంలో.. 800 గజాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. పార్టీ ఆఫీసు ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడకు రానున్నారు మంత్రి తలసాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..