Pawan Kalyani: జనసేనాని వారాహి వెహికల్ ఫీచర్స్ ఏంటో తెలిస్తే.. వావ్ అనాల్సిందే..
ఎన్నికల సమరానికి వారాహి రెడీ. బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఎన్నికల సమరానికి సంసిద్దం. లేటెస్ట్ హంగులతో తయారు చేసిన వాహనం ట్రైల్ రన్ పవన్ సమక్షంలో నిర్వహించారు నిర్వాహకులు. కానీ...
పవన్ ప్రీరిలీజ్ ఏర్పాటు చేస్తే ఈలలు, చప్పట్లు ఓ రేంజ్‌లో ఉంటాయి.. అదీ సినీ అభిమానం. అదే పవన్ ఇప్పుడు ఓ ప్రీరిలీజ్ ఇస్తే రాజకీయ విమర్శలు, వివాదాలు మొదలయ్యాయి. పవన్ మూడురోజుల క్రితం రిలీజ్ చేసిన ఆ ప్రిరిలీజ్ పేరు.. వారాహి. ఇది మూడు గంటల సినిమాకు సంబంధించిన టీజర్ కాదు. ఐదేళ్ల పాటు పాలించేందుకు పవన్ అమలు చేయబోతున్న యాక్షన్ ప్లాన్ ముహూర్తం షాట్. ఈ వెహికిల్‌లోనే పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లబోతున్నారు. అందుకే దీని టైమ్‌లైన్ కూడా రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్. అంటే యుద్ధానికి సిద్ధమని సంకేతం ఇచ్చారన్నమాట. వారాహి పేరులో కూడా ఉంది.. వార్!
పవన్ రిలీజ్ చేసిన ఈ వీడియో అభిమానాలు కావాలంటే స్టేటస్ పెట్టుకోడానికి వీలుగా జస్ట్ 29సెకన్స్ మాత్రమే. సినిమా స్టార్టింగ్‌లో పవన్ ఎంట్రీ తరహాలోనే, క్లైమాక్స్‌లో అదిరిపోయే సీన్‌లాగానో ఉంది. కానీ అదే ముప్పై సెకన్ల వీడియో ఇప్పుడు పొలిటికల్‌గా రంగుపడేలా చేస్తోంది. రాజకీయ విమర్శలు పక్కనబెట్టండి. కానీ అసలు వారాహిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? తెలుసుకుందాం పదండి.
-
- ఇది యుద్ధంలో వాడే ఆర్మీ ట్యాంక్‌లను పోలి ఉంటుంది. యుద్ధం, తుపాకులు వంటి వాటితో సినిమాల్లో ఆయన అభిరుచిని చూపించే పవన్ తన ప్రచారరథం విషయంలోనూ అదే టేస్ట్ చూపించారు.. !
- ఇక కచ్చితంగా చెప్పుకోవాల్సింది దీనికి ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్. అందులో ప్రధానమైనది సీసీ కెమెరాలు. వారాహికి నలువైపులా సీసీకెమెరాలు ఉన్నాయి. పవన్ వెహికిల్ ఎక్కిన దగ్గర నుంచి మళ్లీ పార్క్ చేసి ఆయన బసకు వెళ్లే వరకూ వాహనం పరిసరాల్లో జరిగేదంతా ఇవి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రికార్డ్ చేస్తాయి.
- ఇక సెక్యూరిటీపరంగా మరో ఫీచర్.. టెక్నాలజీ. పవన్ వెహికిల్‌లో ఉండగా, పర్మిషన్ లేకుండా చీమ కూడా లోనికి వెళ్లలేనంత పటిష్టంగా తయారుచేశారు దీన్ని. అంటే ఎటువైపు నుంచి ఎందరు వచ్చి డోర్ ఓపెన్ చేద్దామన్నా.. విత్ అవుట్ యాక్సెస్ అది ఓపెన్ కాదు.. !
- ఇక కావాలని ఏర్పాటు చేయించిన స్పెసిఫికేషన్స్‌లో ఒకటి.. విద్యుత్ నిరంతర సరఫరా. గతంలో పవన్ ప్రసంగాల టైమ్‌లో ప్రత్యర్థులు కావాలని పవర్ కట్ చేశారన్న ఆరోపణలు అనేకం చేశారు. ఈ వెహికిల్‌లో అలాంటి అంతరాయం ఉండదు. ఒకవేళ చుట్టూ పవర్ కట్ అయినా దానికి ఉన్న లైటింగ్ చాలా దూరం కవర్ చేస్తుంది. పైగా ప్రసంగాలకు ఆటంకం ఉండదు.
- వారాహిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సౌండ్ సిస్టమ్. పొలిటికల్ స్పీచ్‌ల టైమ్‌లో వాడే సాదాసీదా సౌండ్ సిస్టమ్ కాకుండా.. లో ఆడియోను కూడా శక్తిమంతంగా, ఎక్కువదూరం వినిపించగలిగే టెక్నాలజీ ఆ సౌండ్ సిస్టమ్‌కి ఉందంటున్నారు.
- ఇక ఈ మధ్యకాలంలో ప్రతీ పార్టీ వాళ్ల ప్రసంగాలకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తోంది. జనసేన కూడా ఆ టెక్నాలజీని ఎప్పటి నుంచో వాడుకుంటోంది. కానీ.. జర్నీతోపాటు జరిగే ఈ ప్రసంగాల్లో టెక్నికల్ సమస్యలు లేకుండా ఏకంగా ఓ సర్వర్‌నూ ఏర్పాటు చేశారు.
- ఇక వారాహి లోపల పవన్ కాకుండా మరో ముగ్గురు కూర్చునే వీలు ఉంటుంది. ఒకవేళ ఎక్కడిక్కకడ ఎవరితోనైనా చర్చలు జరపాల్సి వస్తే సౌకర్యంగా ఉండేందుకు జరిగిన ఏర్పాట్లివి.
- వాహనంలో మరో ప్రత్యేకత హైడ్రాలిక్ మెట్లు. పవన్ జర్నీలో కాకుండా ప్రసంగించే టైమ్‌లో వాహనం పైకి వెళ్లేందుకు ఈ హైడ్రాలిక్ మెట్లు ఉపయోగంపడతాయి
- ఇక ఫిల్మ్ కార్‌వ్యాన్‌కు ఉన్న మిగతా ఫెసిలిటీస్ దీనికి కామన్‌గానే ఉంటాయి. అంటే రెస్ట్ రూమ్, కునుకు తీసేందుకు చిన్నపాటి బెడ్ తరహా ఏర్పాట్లు, టీవీ, అవసరాలు తీర్చగలికే చిన్న ప్యాంట్రీ అన్నమాట.
ఇదీ వారాహి స్పెషల్. కానీ స్పెషల్‌గా కనిపించాలనే క్రమంగా చేసిన ఓ ప్రయత్నమే ఇప్పుడు వివాదంగా కనిపిస్తోంది. అదే రంగు. ఆలీవ్ గ్రీన్ కలర్‌లో ఉన్న వారాహిపై విమర్శలు చేస్తోంది వైసీపీ. భారత రక్షణ రంగం తప్ప మరొకరు వాడడానిని వీల్లేని ఆలీవ్ గ్రీన్‌ను వారాహికి ఎలా ఉపయోగించారని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ.
వైసీపీ నేతల విమర్శల ప్రకారం ఆ యాక్ట్‌ను ఓసారి చూద్దాం..
1)వారాహి 1989 మోటార్ వెహికిల్ యాక్ట్‌ను ఉల్లంఘించిందని చెబుతున్నారు 2)ఆ యాక్ట్‌లోని 5వ చాప్టర్ 121వ నిబంధన వారాహికి పట్టదా అని ప్రశ్నిస్తున్నారు 3)ఆ నిబంధన ప్రకారం రైతులు వాడే ట్రాక్టర్‌సహ ఏ వాహనానికీ ఆలీవ్ గ్రీన్ రంగు ఉండకూడదు 4)ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. 5) 2021లో హిమాచల్‌లో ఏకంగా 15వేల వాహనాలకు రంగులు మార్చేశారు!
– పవన్ ప్రచార రథం వారాహిపైనా ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శలు అవే. రక్షణదళానికి సంబంధించిన రూల్స్‌ను జనసేన బేఖాతర్ చేసిందంటున్నారు. కానీ.. జనసేన నేతలు మాత్రం చట్టానికి లోబడే వాహనం తయారైందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..