Janasena Vs YCP: ఓ మై వారాహి..! ఏపీలో మహారంజుగా రంగుల యుద్ధం.. పేలుతున్న మాటల తూటాలు.. వీడియో.
వైసీపీ మంత్రుల కామెంట్లుకు స్పందించిన పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇచ్చారు. కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల దాకా రాష్ట్రం వదిలిపారిపోతున్నాయి.. రంగుల మీద కాకుండా ముందు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టాంటూ పవన్..
ఏపీలో పార్టీలన్నీ సమరశంఖం పూరించి జనాల్లోకి వెళుతున్నాయి.. అయితే జనసేన వాహనమే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద వివాదంగా మారింది. రక్షణ రంగానికి మాత్రమే అనుమతి ఉన్న ఆలీవ్ కలర్ ఎన్నికల ప్రచార రథానికి ఎలా వాడతారంటోంది వైసీపీ. చట్టానికి విరుద్దమంటూ మోటార్ వెహికిల్ యాక్ట్ కూడా కోట్ చేస్తోంది. అయితే వైసీపీ తరహాలో రంగుల విషయంలో కోర్టు బోనులో నిలబడే పరిస్థితి తెచ్చుకోమని… చట్టాలను గౌరవిస్తామంటూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది జనసేన.మంత్రుల కామెంట్లుకు స్పందించిన పవన్ కల్యాణ్ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇచ్చారు. కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల దాకా రాష్ట్రం వదిలిపారిపోతున్నాయి.. రంగుల మీద కాకుండా ముందు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టాంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రంగుల రాజకీయం ఏపీలో రసవత్తరంగా సాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..