Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Anil kumar poka

|

Updated on: Dec 09, 2022 | 5:48 PM

పెళ్లికి మందు శృంగారం చేయడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, సమాజంలో మార్పుల కారణంగా ఈ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.



పెళ్లికి మందు శృంగారం చేయడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, సమాజంలో మార్పుల కారణంగా ఈ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తుంది ఇండోనేషియా. అయితే ఈ విధానాన్ని గతంలోనే తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఆ దేశ డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారియేజ్‌ వివరించారు.ఇక ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. వీటికి సంబంధించిన క్రిమినల్‌ కోడ్‌ ముసాయిదా ను ఈ డిసెంబర్‌లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేని వారితోనూ శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచారం కింద శిక్షిస్తారు. గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది. ఇండోనేసియా పౌరులకే కాకుండా విదేశీయులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 09, 2022 05:48 PM