Immunity Care: చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుకోవడానికి శరీరంలోని రోగనిరోధక శక్తి మంచిగా ఉండడం చాలా ముఖ్యం. లేకపోతే అనేక వ్యాధులతో మనం బాధపడవలసి ఉంటుంది. అయితే శీతాకాలం.. అంటువ్యాధులు.. ఇందుకు

Immunity Care: చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
Recipes For Immunity
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 11, 2022 | 7:03 PM

మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుకోవడానికి శరీరంలోని రోగనిరోధక శక్తి ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అనేక వ్యాధులతో మనం బాధపడవలసి ఉంటుంది. అయితే శీతాకాలం ప్రారంభం అంటేనే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు మనల్ని వెంటాడడం మొదలవుతుంది. ఫలితంగానే చలికాలంలో జలుబు, దగ్గు లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. ఆ క్రమంలోనే రమనం పాటించవలసిన ముఖ్యమైన నియమం ఆహారమార్పు. సీజన్‌కు తగినట్లుగా మనం మన ఆహారపు అలవాట్లను పాటించాలి. అలా చేయడం వల్ల మనం మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కాక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవచ్చు. శీతాకాలంలో మన రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పనిచేసే మూడు రకాల వంటకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం, క్యారెట్ సూప్:

శీతాకాలంలో ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం అల్లం క్యారెట్ సూప్ ఉత్తమమైన ఎంపిక. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్‌తో పాటు అల్లంలోని గుణాలు మనకు బాగా ఉపకరిస్తాయి. కంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా క్యారెట్‌లోని పోషక గుణాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఇన్ఫెక్షన్‌ను దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అల్లం-క్యారెట్ సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.

మూంగ్ దాల్, కొబ్బరి కివి సూప్:

మూంగ్ పప్పు, కొబ్బరి మరియు కివితో చేసిన సూప్ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో విటమిన్ సీ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూంగ్ పప్పులో పుష్కలంగా ఉండే ప్రోటీన్ మనల్ని చాలా కాలం పాటు ఆకలి నుంచి సంతృప్తిగా ఉంచుతుంది. దీనికి లవంగాలు, ఎండుమిర్చి, పసుపు వంటి మసాలా దినుసులు జోడించడం వల్ల రోగనిరోధక శక్తి  మరింతగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్:

మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్‌లో మీకు నచ్చిన కూరగాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి సూప్ చేసుకోవచ్చు. ఈ సూప్ రుచికరమైనదిగా ఉండడమే కాక రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!